తాజాగా కొలువుదీరిన ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘట్టం వెలుగు చూసినట్టు తెలుస్తోంది. వైసీపీకి బద్ధ విరోధి.. మాజీ సీఎం జగన్ అంటే.. ఉవ్వెత్తున ఎగిరిపడే మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ నాయకుడు రఘురామకృ ష్ణ రాజు.. నేరుగా జగన్తో సంభాషించారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సోమవారం ప్రారంభమైన ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం జగన్.. తన 11 మంది ఎమ్మెల్యేలతో నల్లకండువా ధరించి.. ప్లకార్డులు పట్టుకుని సభకు వచ్చారు. అయితే.. ప్లకార్డులను పోలీసులు అనుమతించలేదు.
అనంతరం.. ఒక్కొక్కరుగా వైసీపీ సభ్యులు నల్లకుండువాలతోనే.. సభలోకి ప్రవేశించారు. ఈ సందర్భం గా.. అప్పుడే సభలోకి వెళ్లేందుకు అటుగా వచ్చిన రఘురామకృష్ణ రాజుకు జగన్ తారసపడ్డారు. ఈ సంద ర్భంగా ఇరువురి మధ్య సంభాషణ జరిగిందనేది చర్చగా మారింది. సాధారణంగా జగన్ తన వారితో కలిసి వెళ్లిపోతున్న సమయంలో రఘురామ ఎదురు పడ్డారు. అయితే.. ఆయనను పట్టించుకోకుండానే జగన్ ముందుకు సాగారు.
కానీ, రఘురామే జగన్ వద్దకు వచ్చి.. “హౌఆర్ యూసర్!“ అని పలకరించారు. దీనికి జగన్ నవ్వుతూ ముందుకు వెళ్లిపోయారనేది వైసీపీ నాయకులు చెబుతున్నమాట. కానీ, మరో వైపు.. జగన్ భుజంపై రఘురామ చేయి వేశారని.. ఆయనను `నువ్వు` అంటూ ఏకవచనంతో సంబోధించారని.. “నువ్వు సభకు రావాలి.. సభలో ప్రతిపక్షం లేకపోతే.. నవ్వుతారు“ అంటూ రఘురామ వ్యాఖ్యానించినట్టు ఓ వర్గం మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి జగన్.. “అలాగే సర్!“ అని చెప్పినట్టు పేర్కొన్నారు.
కానీ, వాస్తవం మాత్రం.. జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడేంత చనువు రఘురామకు లేదు. ఒక్క రఘు రామకే కాదు.. ఎవరికీ లేదు. పైగా నువ్వు అనేంత పరిస్థితి కూడా లేదు. కేవలం ఇద్దరూ ఎదురు పడ్డారు. ఆయన నవ్వుతూ హౌఆర్ యూ సర్.. అన్నంత వరకు కరెక్ట్. తర్వాత.. జరిగింది మాత్రం నిజమైతే.. తెలియాల్సి ఉంది.