ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య వచ్చిన చిత్రాల్లో `డార్లింగ్` ఒకటి. కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి పులికొంద, ఇస్మార్ట్ పోరి నభా నటేష్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. అశ్విన్ రామ్ డైరెక్ట్ చేసిన డార్లింగ్ మూవీని కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న డార్లింగ్ మూవీ జులై 19న విడుదలై ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
పెళ్లి తర్వాత వైఫ్ తో కలిసి పారిస్‌కు హనీమూన్ వెళ్లాలని చిన్నతనం నుంచి కలలు కనే అబ్బాయి లైఫ్ లోకి అపరిచితురాల్లాంటి అమ్మాయి భార్య వస్తే ఏం జరిగింది..? అన్నదే డార్లింగ్ మెయిన్ స్టోరీ.కథా నేపథ్యం బాగున్నా.. దాన్ని ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ వివేక్ సాగర్ విఫలం అయ్యాడు. ప్రియదర్శి, నభా నటేష్ తమ పాత్రల్లో చెలరేగిపోయినా.. పేలవంగా సాగే స్క్రీన్ ప్లే, ఎగ్జైట్ చెయ్యని ట్విస్ట్ లు, పండని ఎమోషన్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి.
రిలీజ్ కు ముందు తెగ హడావుడి చేసిన డార్లింగ్.. ఇప్పుడు ఎక్కడా సౌండ్ కూడా చేయట్లేదు. బలగం తర్వాత మరో హిట్ కొట్టాలని ఆశపడ్డ ప్రియదర్శికి నిరాశే ఎదురైంది. ఇకపోతే ఇండస్ట్రీలో ఒకరు వద్దనుకున్న కథను మరొకరు పట్టుకోవడం చాలా కామన్. డార్లింగ్ మూవీ విషయంలోనూ ఇది జరిగింది. సినిమా ఫ్లాప్ అని ముందే గ్రహించిన ఓ టాలీవుడ్ హీరో చాలా తెలివిగా డార్లింగ్ నుంచి తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు అల్లరి నరేష్.
డైరెక్టర్ అశ్విన్ రామ్ చాలా ఏళ్ల క్రితమే డార్లింగ్ స్టోరీ రాసుకున్నారు. 2018లో ప్రియదర్శికి చెప్పాడు. అప్పటికి హీరోగా ప్రియదర్శికి మార్కెట్ లేకపోవడంతో సినిమా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అల్లరి నరేష్ వద్దకు వెళ్లగా.. ఆయనకు స్టోరీ నచ్చలేదు. దాంతో అశ్విన్ రామ్ కథలో పలు మార్పులు చేసి చెప్పారు. అయినా కూడా అల్లరి నరేష్ నో చెప్పాడు. చివరకు అటు తిరిగి ఇటు తిరిగి ప్రియదర్శి ఖాతాలోనే డార్లింగ్ పడింది.