టాలీవుడ్ లో కమెడియన్ గా, హీరోగా సత్తా చాటుతున్న నటుల్లో ప్రియదర్శి పులికొండ ఒకడు. ఈయన కథానాయకుడిగా తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ `డార్లింగ్`. ఇస్మార్ట్ పోరి నభా నటేష్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇస్తోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకం మీద కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన డార్లింగ్ మూవీకి అశ్విన్ రామ్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.
యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న డార్లింగ్.. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడెక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని జూలై 19న థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. తాజాగా నిర్మాతలు డార్లింగ్ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో హనీమూన్ కు ప్యారిస్ వెళ్లాలని బాల్యంలోనే నిర్ణయించుకుంటాడో యువకుడు(ప్రియదర్శి). కెరీర్ పరంగా సెటిల్ అయిన తర్వాత ఒక యువతి(నభా నటేష్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.
కానీ నభా నటేష్ అపరిచితుడు మూవీలో విక్రమ్ మాదిరిగానే స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. ఈ విషయం తెలిశాక హీరో పరిస్థితేంటి..? అపరిచితుడులా ప్రవర్తించే భార్యతో భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..? చిన్నతనంలోనే వైఫ్ తో పారిస్ వెళ్దామనుకున్న హీరో కల నెరవేరుతుందా? లేదా? అన్నది తెలియాలంటే డార్లింగ్ మూవీ చూడాల్సిందే.
ట్రైలర్ మాత్రం నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అపరిచితుడు పెళ్ళాంతో ప్రియదర్శి పడే తిప్పలను ట్రైలర్ లో చాలా ఫన్నీగా చూపించారు. ఫుల్ ఫన్ రైడ్ లా సాగిన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ప్రియదర్శికి డార్లింగ్ మూవీతో మరో హిట్ ఖాయమని.. నభాకు ఇది బెస్ట్ రీఎంట్రీ ఫిల్మ్ అవుతుందని కూడా అంటున్నారు.