కొంతమంది సినిమా తారలు ఇండస్ట్రీలో ఉండేది కొన్నాళ్లే అయినా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంటారు. హీరోయిన్ నేహా బాంబ్ కూడా ఆ కోవకే చెందుతుంది. ముంబైకి చెందిన నేహా.. 2001లో ఇష్క్ హో గయా మేను అనే హిందీ మూవీతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ మూవీ ద్వారా తెలుగు సినీ ప్రియులకు పరిచయం అయింది.
వి.వి. వినాయక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, నేహ జంటగా నటించారు. 2003లో విడుదలైన దిల్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే నందిని పాత్రలో నేహ అందం, అభినయానికి విమర్శకుల నుంచి ప్రసంశలు దక్కాయి. ఆ తర్వాత నేహా తెలుగులో అతడే ఒక సైన్యం, దోస్త్, బొమ్మరిల్లు, దుబాయ్ శీను వంటి చిత్రాల్లో నటించింది. అటు హిందీ, పంజాబ్ భాషల్లో అడపా తడపా సినిమాలు చేసింది.
అలాగే బాలీవుడ్ లో పలు హిట్ సీరియల్స్ లో వర్క్ చేసింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రిషి రాజ్ ఝవేరి అనే బడా వ్యాపారవేత్తను నేహా ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వివాహమైన కొంతకాలానికే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. 2007లో నేహా, రిషి రాజ్ పెళ్లి చేసుకోగా.. 2010లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది క్రుశాంత్ గోరగాంధీ అనే మరో వ్యక్తిని నేహా రెండో వివాహం చేసుకుంది.
అప్పటి నుంచి నేహా వెండితెరతో పాటు బుల్లితెరకు దూరమై ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయింది. ఇద్దరు అమ్మాయిలకు కూడా జన్మనిచ్చింది. ఇకపోతే నేహా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఇన్స్టా ద్వారా షేర్ చేస్తుంది. అయితే నేహాను ఇప్పుడు చూస్తే గుర్తుపట్టడం కష్టమే. ఎందుకంటే అంతలా ఆమె మారిపోయింది. అప్పటికీ ఇప్పటికీ ఆమె రూపు రేఖల్లో చాలా మార్పులు వచ్చాయి.
View this post on Instagram