డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైడ్ గా మారుమోగిపోతోంది. 2015 లో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నారు. అలాగే దర్శకుడుగా, రచయితగా విమర్శకుల నుంచి ప్రశంసలు సొంత చేసుకున్నారు. నాగ్ అశ్విన్ రెండో చిత్రం మహానటి. అలనాటి తార సావిత్రి బయోపిక్ ఇది.
2018లో విడుదలైన మహానటి సంచలన విజయాన్ని నమోదు చేసింది. నాగ్ అశ్విన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక తాజాగా కల్కి 2898 ఏడీ చిత్రంతో నాగ్ అశ్విన్ ప్రేక్షకులను పలకరించారు. పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా వీర విహారం చేస్తోంది. కల్కి మూవీతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు అటు ప్రధాన మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది. అతని గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
మూడు సినిమాలకే నాగ్ అశ్విన్ దర్శకుడిగా భారీ స్టార్డమ్ దక్కించుకున్నారు. అయితే ఒకవేళ డైరెక్టర్ కాకపోయుంటే నాగ్ అశ్విన్ ఏమయ్యుండేవారో తెలుసా.. డాక్టర్. అవును మీరు విన్నది నిజమే. డాక్టర్స్ ఫ్యామిలీ లో ఆయన జన్మించారు. నాగ్ అశ్విన్ తండ్రి జయరామ్ మరియు తల్లి జయంతి రెడ్డి వైద్య వృత్తిలోనే ఉన్నారు. నాగ్ అశ్విన్ సోదరి కూడా డాక్టరే. వైజాగ్ మరియు హైదరాబాద్ వంటి నగరాల్లో వీరి ఫ్యామిలీకి హాస్పిటల్స్ ఉన్నాయి.
నాగ్ అశ్విన్ ను కూడా డాక్టర్ ను చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఇంటర్ లో ఆయన MBiPC ఇంజనీరింగ్, మెడిసిన్ ఉండే కోర్స్ చేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్ రెండు ఎంట్రన్స్ లు కూడా రాసి క్వాలిఫై అయ్యారు. అయితే సినిమాలపై ఉన్న మక్కువ కారణంగా నాగ్ అశ్విన్ మెడిసిన్ కాకుండా మణిపాల్ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో డైరెక్షన్ కోర్స్ చేసి.. ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ డైరెక్టర్గా ఎదిగారు. ఒకవేళ సినీ పరిశ్రమలోకి రాకపోయుంటే నాగ్ అశ్విక్ కూడా డాక్టరే అయ్యుండేవాడని ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో ఆయన త్లి జయంతి గారు తెలియజేశారు.