సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని దేశమంతా కితాబిస్తోంది. కానీ, మాజీ సీఎం జగన్ , వైసీపీ నేతలు మాత్రం విజనరీ అంటూ ఆయనను ఎటకారం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు ముమ్మాటికీ విజనరీ లీడర్ అని ప్రూవ్ చేసే ఘటన ఒకటి జరిగింది. తాజాగా మంగళగిరిలో పెన్షన్ల పంపిణీ మొదలుబెట్టిన చంద్రబాబు..ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టిలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో పోలవరం నిర్మాణం పూర్తయ్యే తేదీ ఎందుకు లేదు అని చంద్రబాబును ఓ యువతి ప్రశ్నించింది. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవాలి అంటుంటారు…మరి శ్వేత పత్రంలో పోలవరం పూర్తి తేదీ ఎందుకు లేదు అని ప్రశ్నించిన ఆ యువతికి నవ్వుతూ చంద్రబాబు సమాధానమిచ్చారు.
‘‘రాష్ట్రంలో ఉండే అర్థం కావాలి. నదికి అడ్డుగా ప్రాజెక్ట్ కడతాం..కానీ, నదిని తిప్పి దారి మళ్లించి పోలవరం కడుతున్నాం. నీళ్లు పక్కకు తీసుకువచ్చి. ఎర్త్ కమ్ డ్యామ్ కడతాం. పోలవరంలో ఏంటంటే కింద ఇసుక పొరలున్నాయి. నీళ్లు వెళ్లి పోకుండా అరెస్ట్ చేయాలి. ఒక స్పెషల్ టెక్నాలజీతో 95 మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి. దానిని డయాఫ్రమ్ వాల్ అంటాం. పోలవరంలో ఆరు నెలలే పని. జూలై నుంచి వర్షాలు..డిసెంబర్ వరకు వరదలుంటాయి. డిసెంబర్ నుండి మే వరకు పూర్తి చేయాలి. నేను సీఎంగా ఉన్నపుడు 2 సీజన్లలో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాం. ఆ తర్వాత స్పిల్ వే కట్టాం’’ అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు వింటే ఆయన ఎంత విజనరీనో అర్థం అవుతుంది.
సరే, పోలవరం గురించి నాలుగు ముక్కలు మాజీ సీఎం జగన్ ను పిలిచి అడిగితే ఆయన ఏం చెప్పగలరు. ఇక, ఆయన కేబినెట్ లోని నీటిపారుదల శాఖా మంత్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ క్రమంలోనే జగన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. పోలవరంపై ఏ మాత్రం అవగాహన లేని, ఇంగిత జ్ఞానం లేని చిల్లర గాళ్ళు ఇజనరీ ఇజనరీ అంటూ చంద్రబాబు గురించి ఎటకారాలు ఆడారంటూ వైసీపీ నేతలను ట్రోల్ చేస్తున్నారు. ఇంత సబ్జెక్ట్, తపన ఉన్న లీడర్స్ ఎంత మంది ఉంటారు? అని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లు ఒక అసమర్థుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టామని, చిల్లర రాజకీయం, స్వార్థం తప్ప ఒక్క శాతం కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి తపన లేదని విమర్శిస్తున్నారు. ఏపీకి జగన్ చేసిన నష్టం తరతరాలు పూడ్చలేనిదంటూ ఏకిపారేస్తున్నారు. ఈ వీడియో చూస్తే జగన్ ఎంత అసమర్థుడో తెలుస్తుంది అంటూ ఆ యువతి ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.