టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కెరీర్ పరంగా మళ్ళీ మునుపటి జోరును చూపిస్తోంది. 2020 లో వచ్చిన అలా వైకుంఠపురంలో తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ పూజా ఖాతాలో పడలేదు. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడి పూజా హెగ్డే కు షాకుల మీద షాకులు ఇచ్చాయి. వరుసగా అరడజన్ ప్లాపులు రావడంతో పూజా హెగ్డేను ఐరన్ లెగ్ అంటూ చాలా మంది ట్రోల్ చేశారు. పూజ కెరీర్ క్లోజ్ అని.. స్టార్ హీరోలతో పాటు టైర్ 2 హీరోలు కూడా ఆమెకు అవకాశం ఇవ్వట్లేదని పెద్ద ఎత్తున్న ప్రచారం కూడా జరిగింది.
అయితే ఆ ప్రచారానికి పూజా హెగ్డే ఫైనల్ గా చెక్ పెట్టేసింది. చిన్న బ్రేక్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు సంతకాలు చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో దేవ అనే సినిమాలో భాగమైంది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ మరియు పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య 44వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వం అందించడమే కాకుండా సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
ఇవి రెండు కాకుండా కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి మరియు తెలుగులో సురేష్ బాబు నిర్మాణంలో ఓ చిత్రానికి పూజా సైన్ చేసిందట. ఇక రెమ్యునరేషన్ విషయంలోనూ పూజా అస్సలు తగ్గట్లేదట. ఒక్కో చిత్రానికి ఆమె రూ. 4 కోట్లు ఛార్జ్ చేస్తుందని బలంగా టాక్ నడుస్తోంది. దీంతో పూజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అట్లుంటరి మరి పూజా పాపతోని అంటూ అభిమానులు కలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడు నోరు తెరిచే దమ్ముందా అంటూ ట్రోలర్స్ ను ప్రశ్నిస్తున్నారు.