తన హయాంలో విశాఖలోని రుషికొండపై మాజీ సీఎం జగన్ 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖరీదైన భవనాలు నిర్మించిన వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా 26 లక్షల రూపాయలు పెట్టి బాత్ టబ్ కొన్న వ్యవహారం జాతీయ మీడియాలో కూడా హైలైట్ అయింది. అయితే, జగన్ బండారం బయటపడడంతో వైసీపీ నేతలు యథా ప్రకారం సీఎం చంద్రబాబు పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో ఉందని, దానికి బిల్లు అప్పటి ప్రభుత్వం చెల్లించిందని విష ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ బిల్లును ప్రభుత్వం కాదు, హెరిటేజ్ సంస్థలు చెల్లించాయని ఆధారాలతో సహా బయటపెట్టడంతో వైసీపీ నేతల నోళ్లు మూతపడ్డాయి. గతంలో జూబిలీ హిల్స్ లోని రోడ్డు నెంబర్ 65లో సొంత ఇల్లు సరిపోకపోవడంతో చంద్రబాబు కొత్త ఇంటిని నిర్మించాలనుకున్నారు. ఆ సమయంలో పాత ఇల్లు ఖాళీ చేసి పార్క్ హయత్ హోటల్లో చంద్రబాబు తన ఫ్యామిలీతో ఉన్నారు. చంద్రబాబు కుటుంబం కోసం మొత్తం 3 సూట్లు అద్దెకు తీసుకున్నారని, రోజుకు మూడున్నర లక్షల అద్దె చొప్పున 3 నెలలకు మొత్తం 3 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ, టీడీపీ నేతలు వాస్తవాలు బయటపెట్టడంతో వారు సైలెంట్ అయ్యారు.
https://x.com/tummalarakesh6/status/1802577306587684934?t=T3sOC34RbhQFBILeN2fLcQ&s=03