వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు మాధురిని పోలీసులు ఓ యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేశారు. చెన్నైలోని బిసెంట్ నగర్లో మాధురి నడుపుతున్న కారు పుట్పాత్పైకి దూసుకు వెళ్లింది. దీంతో, ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న సూర్య అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీ సాయంతో విచారణ జరిపిన పోలీసులు మాధురి నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత మాధురిపై కేసు నమోదు చేశారు. అయితే, మాధురికి బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.