ఏపీలో జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిం దే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన 70 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో అంటే 2019లో రెండు స్థానాల్లో పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీ చేశారు. పైగా.. పవన్‌ను ఓడించేందుకు వైసీపీ అనేక వ్యూహాలు కూడా పన్నింది.
అయినప్పటికీ.. మెగా కుటుంబం మొత్తం ఏకమై.. పవన్ కోసం ప్రచారం చేయడం.. చివరిలో మెగాస్టార్ చిరు కూడా.. పవన్ విజయం కోసం.. తపించడం సెల్ఫీ వీడియోను విడుదల చేయడం కూడా.. పవన్ గెలుపునకు కారణమనే చెప్పాలి. ఇక, మెగా కుటుంబంలోని నాగబాబు కుమారుడు సహా మేనల్లుడు, హీరో.. సాయి ధరమ్ తేజ్ అయితే.. పిఠాపురంలోనే వారం రోజులు మకాం వేసి మరీ.. మావయ్య గెలుపు కోసం ప్రచారం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఆయన ప్రచారం దంచి కొట్టియువతను ఆకర్షించారు.
మొత్తంగా పవన్ విజయం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ విజయం దక్కించుకుంటే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నట్టు తెలిసింది. అది కూడా.. ఏడు కొండల కూ.. .కాలినడకన వచ్చి దర్శనం చేసుకుంటానని ఆయన మొక్కుకున్నట్టు సాయి ధరమ్ తేజ్ అనుచరులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమలకు చేరుకున్నారు. ఎన్నికల్లో తన మావయ్య విజయం దక్కించుకోవడం, తన కోరిక తీరడంతో ఆయన మొక్కులు చెల్లించేం దుకు వచ్చారు.
అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకోగా.. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. తన మామయ్య గెలుపుతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తన మామయ్య కోసం.. ఏ పని చేసేందుకైనా తాను సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. కాగా.. సాయి ధరమ్ తేజ్‌తో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఇంట్రస్ట్ చూపించడంతో కాలి నడకన సాగుతూనే వారితో సెల్ఫీలు దిగారు.
పవన్ కళ్యాణ్ గెలవడంతో కాలినడకన తిరుమలకు వెళ్లిన హీరో సాయి ధరమ్ తేజ్
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్.. కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్ళాడు. pic.twitter.com/TLSC2aeZkc
— Telugu Scribe (@TeluguScribe) June 15, 2024