151 సీట్లతో ఏపీ సీఎంగా ఎన్నికైన వైసీపీ అధినేత జగన్ ఆ 151 మంది ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో లేరన్న విమర్శలు ఆ పార్టీ నేతలే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ప్రజలకు జగన్ ఏ మాత్రం అందుబాటులో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. కట్ చేస్తే, 164 మంది ఎమ్మెల్యేలతో గెలిచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తన వంతు పాత్ర పోషించిన ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజుల్లోనే ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. అందుకోసం ప్రజా దర్బార్ నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా…అధికార పక్షంలో ఉన్నా తాను ఎప్పుడూ ప్రజల పక్షమే అని లోకేష్ మరోసారి నిరూపించారు. తాను ఓడిపోయినప్పటికీ ఐదేళ్లుగా మంగళగిరివాసులతో మమేకమై తన సేవా కార్యక్రమాలు కొనసాగించారు లోకేష్. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నియోజకవర్గంలో పత్తా లేకుండా పోయినా కూడా లోకేష్ ప్రజల మధ్యనే ఉన్నారు. ఈ క్రమంలోనే తనను గెలిపించిన మంగళగిరి ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికల్లో హామీ ఇచ్చిన లోకేష్ దానిని నిలబెట్టుకున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శనివారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు లోకేష్.
ప్రజలు పలు సమస్యలను లోకేష్ కు విన్నవించగా…వీలైనంత త్వరగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఏదో థూథూ మంత్రంగా కాకుండా ఆ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశానని మంగళగిరి వాసులకు లోకేష్ చెప్పారు. తాను మంగళగిరిలో ఉన్నపుడు ప్రతి రోజూ ప్రజాదర్బార్ కొనసాగుతుందని లోకేష్ వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం లోకేష్ వేసిన ఈ అడుగు మిగతా ఎమ్మెల్యేలకు స్ఫూర్తిదాయకం అని ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
@ndtv pic.twitter.com/2GgBY4Eiq9
— ???????????????????????????? (@chsanjeevarao12) June 15, 2024