టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నాలుగో సారి ఏపీ సీఎంగా సీబీఎన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కేబినెట్ కొలువుదీరింది. మొత్తం 24 మందితో తన మంత్రివర్గాన్ని చంద్రబాబు ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి..ఇలా 8 మంది బీసీ నేతలకు బాబు కేబినెట్ లో చోటు దక్కింది.
టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవితమ్మలకు కూడా మంత్రి పదవులు వరించాయి. జనసేన నేతలు కందుల దుర్గేశ్, సవిత సహా 8 మంది తొలిసారి ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు దక్కింది. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు నాలుగు బెర్త్ లు దక్కాయి. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్‌లకు అవకాశం దక్కింది. కమ్మ వర్గానికి చెందిన లోకేశ్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ లకు చాన్స్ వచ్చింది. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎం.రాంప్రసాద్రెడ్డిలకు చోటు దక్కింది.
ఎస్సీ కోటాలో అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లిం వర్గం నుంచి మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఆర్య వైశ్య వర్గం తరఫున టీజీ భరత్ చోటు దక్కించుకున్నారు. అసెంబ్లీలో 175 సీట్లు ఉన్న నేపథ్యంలో మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకునే చాన్స్ ఉంది. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి చోప్పున 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు 3, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి 1 (సత్యకుమార్).. 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు లభించాయి.
చంద్రబాబు మంత్రివర్గం జాబితా ఇదే:
1. నారా లోకేశ్, మంగళగిరి
2. కింజారపు అచ్చెన్నాయుడు, టెక్కలి
3. కొల్లు రవీంద్ర, బందరు
4. పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ
5. వంగలపూడి అనిత, పాయకరావుపేట
6. నిమ్మల రామానాయుడు, పాలకొల్లు
7. ఎన్ఎండీ ఫరూక్, నంద్యాల
8. ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు
9. పయ్యావుల కేశవ్, ఉరవకొండ
10. అనగాని సత్యప్రసాద్, రేపల్లె
11. కొలుసు పార్థసారథి, నూజివీడు
12. డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపి
13. గొట్టిపాటి రవికుమార్, అద్దంకి
14. గుమ్మడి సంధ్యారాణి, సాలూరు
15. బీసీ జనార్దన రెడ్డి, బనగానపల్లి
16. టీజీ భరత్, కర్నూలు
17. ఎస్.సవిత, పెనుకొండ
18. కొండపల్లి శ్రీనివాస్,గజపతినగరం
19. ఎం.రాంప్రసాద్ రెడ్డి, రాయచోటి
20. వాసంశెట్టి సుభాష్, రామచంద్రాపురం
జనసేన
1. పవన్ కల్యాణ్, పిఠాపురం
2. నాదెండ్ల మనోహర్, తెనాలి
3. కందుల దుర్గేశ్, నిడదవోలు
బీజేపీ
1. సత్యకుమార్ యాదవ్, ధర్మవరం
ఉమ్మడి జిల్లాల వారీగా కేబినెట్ బెర్త్ లు
చిత్తూరు – 1 (ముఖ్యమంత్రి)
కడప – 1
విశాఖపట్నం – 1
శ్రీకాకుళం – 1
తూర్పు గోదావరి – 2
ప్రకాశం – 2
విజయనగరం – 2
కృష్ణా – 2
నెల్లూరు – 2
పశ్చిమ గోదావరి – 2
గుంటూరు – 3
అనంతపురం – 3
కర్నూలు – 3