ఎన్డీఏ కూటమి సభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు చంద్రబాబు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఈ ప్రజా తీర్పును గౌరవించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనని, తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించి టీడీపీ, జనసేన పొత్తును ఖరారు చేశారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయన్నారు.
తాను ముఖ్యమంత్రి అని, అయినా సరే పవన్ కు సముచిత గౌరవం కల్పిస్తామని, దాని గురించి రేపు ప్రకటన చేస్తామని అన్నారు. తాను, పవన్, పురంధేశ్వరి సామాన్యుల మాదిరి పని చేస్తామని చెప్పారు. గత సీఎంలాగా పరదాలు కట్టుకొని ప్రజల మధ్యకు రాబోమని చెప్పారు.
ఎన్నికల్లో పొరపచ్చాలు లేకుండా కలసి పనియడంతో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని అమరావతేనని, విశాఖపట్నాన్ని ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామని, కర్నూలును కూడా డెవలప్ చేద్దామని పిలుపునిచ్చారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. పెరిగాయన్నారు.