ఏపీలో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి టీడీపీ పోటీ చేసిన 144 స్థానాలకు గాను 135 స్థానాలను కైవసం చేసుకొని అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ దుందుభి మోగించింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నారై టీడీపీ నేత ఎంవీ రావు ఆధ్వర్యంలో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ చంద్రబాబు రాకను అమెరికాలోని శాన్ రామోన్ లోని ఎన్నారై టీడీపీ నేతలు, టీడీపీ అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోబోతోందని ఎన్నారై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 200 మంది ఎన్నారై టీడీపీ నేతలు, టీడీపీ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తక్కువ సమయంలో ఇంతమంది ఒకచోట చేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం విశేషం. సురేష్ పోతినేని, శ్రీనివాస్ మైనేని, రజనీ కాకర్ల, రామ్ మద్దినేని, సూర్యనారాయణ ఆలపాటి, గీతా ఆలపాటి, వంశీ పాలడుగు, శిల్పా మద్దినేని, ఆదినారాయణ, రామ్ ప్రసాద్ ఛోడె, రామ్ బైరపనేని, ప్రణీత జంపని, భువనేశ్వరి శ్రీరాంరెడ్డి, శ్రీనావాస్ మైనేని, బాలకృష్ణ కంతేటిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారికి ఎంవీ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇక, కార్యక్రమ నిర్వహణకు తక్కువ సమయం ఉన్నా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారని, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు దోహదపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఎంవీ రావు చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు పసందైన విందు భోజనం ఏర్పాటు చేసిన ఫుడ్ స్పాన్సర్లకు, కో ఆర్డినేటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మీడియా మొఘల్, ఈనాడు ఛైర్మన్ చెరుకూరి రామోజీ రావు హఠాన్మరణం పాలైన నేపథ్యంలో ఆయనకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన 200 మంది నివాళులు అర్పించి తమ సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీకి రామోజీ రావు చేసిన వెలకట్టలేని సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలపాటు మౌనం పాటించారు.