ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత ఉత్కంఠను కలిగించిన నియోజకవర్గాలు పిఠాపురం, ఉండి. వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు టిడిపిలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగడంతో ఆ నియోజకవర్గంపై అందరి ఫోకస్ ఉంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని జనసేన శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుండగా…వైసీపీ నేత వంగా గీత గెలుస్తారంటూ వైసీపీ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే జనసేన శ్రేణులు ఊహించినట్లుగానే పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ దాదాపు 70వేల ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించారు. ఇక, మంగళగిరి నుంచి బరిలోకి దిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా చరిత్ర సృష్టించారు 41 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్ విజయం సాధించారు. 1985 తర్వాత బిజెపి ఎక్కడ కలవలేదు.
మరోవైపు, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి నరసింహారాజుపై 56 వేల ఓట్ల మెజారిటీతో రఘురామ ఘన విజయం సాధించారు. హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 31 వేల ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. కుప్పంలో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు భారీ లీడ్ లో ఉన్నారు.