ఏపీలోని పల్నాడు జిల్లాకు ఒకప్పుడు ప్రఖ్యాతి ఉండేది. నాయకురాలు నాగమ్మ, పల్నాటి బ్రహ్మనాయు డు వంటి వీరులు ఈ నేలపై అనేక సంవత్సరాలు రాజ్యమేలారు. అలాంటి జిల్లా ఇప్పుడు అత్యంత దారుణమైన జిల్లాగా మారిపోయిందని.. పలువురు చెబుతున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో ఎస్పీ మల్లికా గార్గ్ చేరారు. పల్నాడు జిల్లా అత్యంత వర్సెస్ట్ జిల్లా అని ఆమె పేర్కొన్నారు. పల్నాడు ప్రజలంటే.. కత్తులు, రాడ్లు పట్టుకుని తిరుగుతారనే విషయం దేశం మొత్తం గ్రహించిందన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రం లోనూ లేదన్నారు.
“నాయకులు ఎవరనేది నాకు అనవసరం. జిల్లాకు మాత్రం వరెస్ట్ అనే పేరు వచ్చింది. నా స్నేహితులు ఫోన్లు చేసి మరీ ఈ విషయం కనుక్కుంటున్నారు. ఎన్నికల వేళ ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్ ప్రక్రి యను.. దారుణంగా మార్చారు. ఈవీఎంలను ధ్వంసం చేశారు. కత్తలు, కర్రలతో చెలరేగిపోయారు. ఇలాంటి పరిస్థితిని ఇక నుంచి రానివ్వను“ అని మల్లికా గార్గ్ తేల్చి చెప్పారు. వచ్చే నెల 5 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ను కఠినంగా అమలుచేస్తామన్నారు.
అదే సమయంలో సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం ఉంటుందన్నారు. దుకాణాలు తెరవడానికి అనుమతించబోమన్నారు. ఇటీవల పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఈ చర్యలు మరింత కఠినంగా ఉంటాయన్నారు. ప్రజలు ముందుగానే నిత్యావసరాలు కొని పెట్టుకోవాలని సూచించారు. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండేందుకు వీల్లేదని మల్లికా గార్గ్ తేల్చి చెప్పారు. ఎవరైనా తేడా చేస్తే.. వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు.
సీఎం సొంత జిల్లాలో కూడా..
సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ.. కలెక్టర్ సీరియస్ చర్యలు చేపట్టారు. జిల్లాలో అసాంఘిక శక్తులుగా గుర్తించిన వారిని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. జిల్లా నుంచి వారంతా వెళ్లిపోవాలని. షరతు విధించా రు. పోలింగ్ పూర్తయిన మర్నాడే జిల్లాలో అడుగు పెట్టాలన్నా.. ఏమాత్రం తేడా వచ్చినా.. పీడీ చట్టం కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా 170 మంది రౌడీ షీటర్లనుకూడాజిల్లా వదిలి వెళ్లాలని ఆదేశించారు. మొత్తంగా కౌంటింగ్ సందర్భంగా ఏపీలో ఈసీ చర్యలు కఠినంగానేఉన్నాయని స్పష్టమవుతోంది.