తెలుగు నటి హేమ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఇటీవల బెంగళూరులో వెలుగు చూసిన.. రేవ్ పార్టీలో తాను లేనని.. తనకు ఏపాపం తెలియదని హేమ చెప్పుకొచ్చారు. వరుస వీడియోలు కూడా చేశారు. తాను హైద రాబాద్లోని ఫాం హౌస్లో ఉన్నట్టు తెలిపారు. తనను అనవసరంగా ఈ ఊబిలోకి లాగుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. పదే పదే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా ఆమె పేరు బయటకు వచ్చిందో లేదో అనూహ్యంగా ఆమె స్పందించారు.
అయితే.. నిజం నిప్పులాంటింది కదా.. హేమ కూడా అలానే దొరికిపోయారు. బెంగళూరు పోలీసులు తాజా గా వెల్లడించిన వివరాలను బట్టి.. హేమ అక్కడికి వెళ్లారు. ఆపార్టీలో పాల్గొన్నారు. అంతేకాదు.. ఆమె డ్రగ్స్ కూడా.. తీసుకున్నారు. వీటిని ఆధారాలతో సహా పోలీసులు వెల్లడించారు. పార్టీలో పాల్గొన్న వారి నుంచి రక్త నమూనాలు తీసుకుని పరీక్షించారు. వీటిలో హేమ నుంచి తీసుకున్న రక్తంలో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో ఆమె డ్రగ్స్ తీసుకున్నారని స్పష్టమైంది.
అంతేకాదు..ఇక్కడ మరో ట్విస్టును కూడా.. పోలీసులు వెల్లడించారు. హేమ ఈ రేవ్ పార్టీకి వచ్చే ప్పుడు.. తన పేరును మార్చుకున్నారని తెలిపారు. తన పేరును ఎంట్రీ బుక్లో కృష్ణవేణిగా పేర్కొన్నట్టు పోలీసు కమిషనర్ తెలిపారు. ఎంట్రీఫీజు రూ.50 లక్షలు కూడా.. ఆమె చెల్లించారని.. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా విచారణ చేస్తున్నామన్నారు. ఒక్క హేమే కాకుండా.. మరో అగ్రనటుడు(హీరో) కూడా ఈ పార్టీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఆయన పేరును త్వరలోనే వెల్లడిస్తామన్నారు.