మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడిని అంటూ తన గురించి తాను గొప్పలు చెప్పుకునే అధినేతల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముందుంటారు. తన నోటి నుంచి హామీ వస్తే శిలాశాసనం అన్నట్లుగా చెప్పే మాటలకు.. చేతలకు ఏ మాత్రం సంబంధం లేని పరిస్థితి. గత ఎన్నికల ప్రచారంలో అమరావతిని రాజధానిగా.. కుటుంబాల్లో ప్రేమ.. అప్యాయతలు వెల్లివిరియాలంటే మద్యం రాక్షసిని అంతం చేయాలని.. మద్యనిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పటం తెలిసిందే.
ఈ రెండు విషయాలే కాదు.. బోలెడన్ని హామీల్ని ఇచ్చిన జగన్.. మాట తప్పిన హామీల జాబితా భారీగానే ఉందంటున్నారు. మరి.. ఇన్ని అంశాల్లో మాట తప్పిన ఆయన విషయంలో ఏం చేయాలి? అన్నది ప్రశ్న. మాట తప్పినా.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకున్నా తనకు ఓటు వేయొద్దన్న నాటి జగన్మోహన్ రెడ్డి మాటల్ని కీలకమైన పోలింగ్ రోజున గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మాట ఇచ్చిన తర్వాత తప్పితే ఓటు వేయొద్దన్న జగన్ అన్న మాటల్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఓటర్ మీద ఉంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారింది. ఈ వైరల్ పోస్టులో పేర్కొన్న అంశాల్నిచూస్తే.. ఇన్ని హామీల్నిజగన్ తన ఐదేళ్ల పాలనలో తుంగలోకి తొక్కారా? అనుకోకుండా ఉండలేం. ఇచ్చిన హామీల్లో ఏమీ చేయకుండా.. మాట తప్పిన జాబితాను చూస్తే..
మాట ఇచ్చి నెరవేర్చని హామీలివే..
– మద్యపాన నిషేధం
– ప్రత్యేక హోదా
– వారంలో సీపీఎస్ రద్దు
– రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ
– పోలవరం ప్రాజెక్టు పూర్తి
– ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్
– బస్సు ఛార్జీలను తగ్గిస్తా
– పక్క రాష్ట్రాల కంటే తక్కువగా పెట్రోల్.. డీజిల్ ధరలు
– 2021లోపు రైల్వే జోన్
– రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిది
– రూ.4వేల కోట్లతో విపత్తు నిది
– 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ
– మైనార్టీలకు రూ.5 లక్షల వరకు రుణం
– ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు
– ఉచితగా బోర్లు
– మండలానికి ఒక ఓల్డేజ్ హోం
– నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్.. గోదాము