సార్వత్రిక ఎన్నికల వేళ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. సార్వత్రిక ఎన్నికలు అంటే. కేంద్రంలో అధికార పార్టీని ఎన్నుకునే అవకాశం. ఈ నేపథ్యంలో దేశం మొత్తానికీ అమ లయ్యేలా పార్టీ మేనిఫెస్టోలను విడుదల చేస్తాయి. ఇలా.. కాంగ్రెస్ పార్టీ కూడా.. ఇప్పటికే విడుదల చేసింది. కానీ, చిత్రంగా ఇప్పుడు తెలంగాణకు మాత్రమే పరిమితం అయ్యేలా.. సార్వత్రిక మేనిఫెస్టో విడుదల చేసింది.
దేశంలో ఇప్పటి వరకు జాతీయ పార్టీలు ఇలా.. జాతీయ ఎన్నికలకు రెండు మేనిఫెస్టోలు విడుదల చేసిన సంస్కృతి లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఎప్పుడూ.. ఇలా ప్రత్యేకంగా మేనిఫెస్టోలు రాష్ట్రాల కోసం ఇచ్చిన దాఖలా లేదు. కానీ, ఇప్పుడు బీజేపీ ఎఫెక్టో.. లేక, మరే కారణమో తెలియదు కానీ.. దాదాపు 25 హామీలతో తెలంగాణ ప్రజలకు ప్రత్యేక మేనిఫెస్టో ఇవ్వడం గమనార్హం. వీటిలో కీలక హామీలు ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని తెలిపింది.
ఇవీ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలక హామీలు..
+ హైదరాబాద్లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు
+ సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా
+ హైదరాబాద్ లో ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఐఐఎం ఏర్పాటు
+ ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం
+ పోలవరం విలీన మండలాల్లోని గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడం.
+ రామగుండం–మణుగూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం
+ తెలంగాణలో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు