రాష్ట్రంలోని యువ ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సరికొత్త విధానంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
శుక్రవారం మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయం నుంచి ‘‘ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్’’ పేరుతో 25 ఎన్నికల ప్రచార వాహనాలను ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు వేమూరు రవి జెండా ఊపి ప్రారంభించారు.
మొత్తం 4 రీజియన్లలో 25 పార్లమెంట్లు వారిగా 175 నియోజకవర్గాలలో ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు వాగ్దానంతో యువతను మేలుకొలుపనున్నారు.
నియోజకవర్గ ఎన్ఆర్ఐ విభాగం టీమ్, ఎమ్మెల్యే అభ్యర్ధులతో సమన్వయం చేసుకుని నియోజకవర్గంలో ఒక రోజు టిడిపి ఎన్ఆర్ఐ సభ్యులు క్యాంపెయిన్ చేయునున్నారు.
ఐదేళ్ల చీకటి పాలనలో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో, రాష్ట్ర ప్రజలు ఏమి కోల్పోయారో, యువత జీవితాలు బుగ్గిపాలు అవ్వడానికి కారణమెవరో ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్ ద్వారా ప్రజలకు వివరించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు ఎందుకు తిరిగి అధికారంలోకి రావడం అవసరమో ప్రజల్లో అవగాహన తీసుకురానున్నారు.
దారి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని వివరించనున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను వారి వారి అర్హతలను బట్టి సంబంధింత కోర్సులకు కోచింగ్ ఇచ్చి దేశ-విదేశాల్లో 1 లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇవ్వనున్నారు.
పాడుబడిపోయిన మన రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకునేలా చైతన్యం నింపేందుకు ఎన్ రైజ్ ఏపి క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహణ కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్, రాధాకృష్ణ, ఎన్ఆర్ఐ టిడిపి ప్రెసిడెంట్, గల్ఫ్, ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు కానూరి శేషు బాబు తదితరులు పాల్గొన్నారు.