ఏపీలో వైసీపీ పాలనలో అక్రమాలు జరుగుతున్నాయని.. గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని.. దీంతో చిన్నారులు, యువత గంజాయికి అలవాటు పడి.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. ప్రతిపక్ష నాయకులు సహా.. అనేక మంది ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అనేక ఉద్యమలు.. నిరసనలు కూడా చేపట్టారు. అయితే.. గుంటూరుకు చెందిన ఓ మహిళ.. ఈ క్రమంలో మరింత ఆగ్రహం.. ఆవేదన వ్యక్తం చేస్తూ.. తన బొటనవేలును నరికేసి మరీ నిరసన తెలిపారు. ఈ వ్యవహారం.. ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇదీ.. విషయం!
గుంటూరులోని ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గానికి చెందిన కోవూరు లక్ష్మి.. స్థానికంగా చైతన్యంగా ఉంటా రు. రాజకీయ నేతల వ్యవహారాలు.. అధికారుల పనితీరు వంటివాటిని ఆమె గమనిస్తూ ఉంటారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో జరుగుతున్ అక్రమాలు.. మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత వర్గం చేసిన అన్యాయాలను ఆమె అనేక సార్లు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఉద్యమాలు.. నిరసనలు కూడా తెలిపారు.
మరీముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో యువత, చిన్నారులు గంజాయికి అలవాటు పడుతుండ డాన్ని ఆదర్శ మహిళా మండలి ప్రెసిడెంట్గా ఉన్న లక్ష్మి అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. అంతేకాదు.. స్థానిక ఎస్పీ, కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే.. ఎదురు ఆమెపైనే పోలీసులు కేసులు పెట్టి వేధించారని లక్ష్మి తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక మహిళలతో కలిసి ఆమె రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తిలకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు.
అయితే.. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఎవరికీ వారు అప్పాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో ఆయా ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇచ్చిన లక్ష్మిబృందం.. నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని.. ఏపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే…రాష్ట్రపతి, ప్రదాని, సీజేలు చర్యలు తీసుకుంటారో లేదో అనే సందేహం వచ్చిన లక్ష్మి.. ఏదో ఒకటి చేయడం ద్వారా.. వారి దృష్టిలో పడాలని నిర్ణయించుకుని.. తన ఎడమ చేతి బొటనవేలును తెగనరుక్కున్నారు.
అనంతరం.. రాష్ట్రపతి భవన్ ముందు సెల్ఫీ వీడియో తీసుకుని.. నియోజకవర్గం సమస్యలు, గంజాయికి బానిసలవుతున్న యువత వివరాలు వెల్లడించారు. అంతేకాదు.. తనపై పెట్టిన కేసులు.. వేధింపులు వంటివాటిని కూడా వెలుగులోకి తీసుకువచ్చారు. మరి ఆమె చేసిన త్యాగం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు, గుంటూరు రూరల్ కు చెందిన కోపూరి లక్ష్మి సాహసం ఇది. కళ్ళముందు సమాజం నాశనమై పోతుంటే ఒక ఆదర్శ మహిళగా చూస్తూ ఊరుకోలేక… జగన్ పాలన అరాచకాలను దేశ ప్రజల దృష్టికి తేవాలనుకుంది. ఏకంగా ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద ఏకలవ్య దీక్ష అంటూ తన బొటన వేలిని నరుక్కుంది.… pic.twitter.com/Ocdbng8Kol
— Telugu Desam Party (@JaiTDP) April 22, 2024