టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ , సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు మధ్య అనుకోని వివాదం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఛోటా చెడుగా మాట్లాడడం హరీష్ శంకర్‌కు కోపం తెప్పించి.. ఒక నోట్ రిలీజ్ కూడా చేయడం గమనార్హం. ఇంతకీ ఛోటా ఏమన్నాడు.. దానికి హరీష్ ఏమని బదులిచ్చాడో చూద్దాం పదండి.
ఓ ఇంటర్వ్యూలో కెమెరామన్‌గా తన పనితీరు ఎలా ఉంటుందో చెబుతూ అనుకోకుండా హరీష్ శంకర్ ప్రస్తావన తెచ్చాడు ఛోటా కే నాయుడు. హరీష్ శంకర్ అని ఒక దర్శకుడు ఉన్నాడు అంటూ.. రామయ్య వస్తావయ్యా సినిమాకు పని చేసేటపుడు హరీష్ శంకర్ కొన్ని విషయాల్లో అస్తమానం అడ్డుపడుతుండే వాడని.. ఇలా చేద్దాం అలా చేద్దాం అంటూ చెప్పేవాడని.. అది కరెక్ట్ కాదని ఎన్నిసార్లు తాను చెప్పడానికి ట్రై చేసినా వినే మూడ్‌లో అతను లేడని.. చివరికి చివరికి తనకు ఏం కావాలో ఆ రకంగా పని చేయడం మొదలుపెట్టానని చెప్పాడు ఛోటా.
ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతూ హరీష్ శంకర్ దృష్టిలో పడింది. ఆ లింక్‌నే కోట్ చేస్తూ హరీష్ శంకర్ ఒక నోట్ రిలీజ్ చేశాడు. రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా, కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు.
మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్‌లో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ ని తీసేస్తున్నాడు అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే గబ్జర్ సింగ్ వచ్చినప్పుడు నాది రామయ్య వస్తావయ్య’ వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది.
మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా,నా ప్రస్తావన రాకున్నా , నాకు సంబంధం లేకున్నా, నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా, కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను.
అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అని అంటే ఏ రోజైన ఏ ప్లాట్ ఫామ్ లో అయినా నేను రెడీ అని హరీష్ రిటార్ట్ ఇచ్చాడు. దీనిపై మళ్లీ ఛోటా ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.