ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఆలూరులో జరిగిన ప్రజాగళం సభలో ప్రసంగించిన చంద్రబాబు…జగన్ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి మూడు పార్టీలు కలిశాయని అన్నారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని చెప్పారు. ఏపీలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టే తరుణం ఇదేనని, రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవేనని చంద్రబాబు అన్నారు.
అధికార మదంతో విర్రవీగుతున్న జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని, రాష్ట్రాన్ని దోపిడీ చేసిన జగన్ రెడ్డికి జే గన్ రెడ్డి అని మరో కొత్త పేరు పెడుతున్నానని అన్నారు. జగన్ ను గెలిపిస్తే ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నాడని, ఇక్కడ పులి అంటూ…ఢిల్లీలో పిల్లిలా ఉంటాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని గాలి కొదిలేసి 13 లక్షల కోట్ల అప్పులపాలు చేశాడని ఆరోపించారు. జగన్ రెడ్డి మాత్రమే పెత్తనం చేస్తుంటాడు… మనమంతా బానిసలుగా ఉండాలని అన్నారు.