ఏపీ సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి పంచ్ ల వర్షం కురిపించారు. గురజాల నియోజకవర్గంలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న నన్నూరి తన మార్క్ డైలాగులతో జగన్ అండ్ కోపై సెటైర్లు వేశారు. ఏసీ వేసుకుంటే ఎండాకాలం…స్వెట్టర్ వేసుకుంటే చలికాలం…గొడుగు పట్టుకుంటే వానాకాలం…వైకాపా జెండా పట్టుకుంటే పోయే కాలం…అంటూ నన్నూరి వేసిన పంచ్ డైలాగులు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మా ముక్కోడని పంపినం..మీ తిక్కోడిని కూడా పంపాలి అంటూ జగన్, కేసీఆర్ లపై విమర్శలు గుప్పించారు.
మా ముక్కోడు కూడా మొన్న ఎన్నికల ముందు వరకు నీలిగిండు..ముక్కోడు పోయిన తర్వాత తిక్కోడు పరేషాన్ అవుతున్నడు అంటూ పంచులు వేశారు. ధర్మానికి అధర్మానికి…ప్రిజనరీకి విజనరీకి…నీతికి అవినీతికి జరగబోతున్న యుద్ధం ఈ ఎన్నికలు అని అన్నారను. శోభనం గదిలో ఉన్న పెళ్లి కొడుకు వచ్చి..ఇంకో పెళ్లి చేస్తే కవల పిల్లలు కంటా అన్న రీతిలో…అధికారంలో ఉన్నపుడు అభివృద్ధి చేయని జగన్…మరోసారి అధికారం కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. 2014లో నాన్న లేడు..2019లో చిన్నాన్న లేడు…అంటూ జగన్ ఎన్నికల ప్రచారం చేశారని గుర్తు చేశారు.
జగన్ పాలనలో ఏపీలో నదిలో ఇసుకబాయే…అప్పులు పెరిగిపాయే…బాబాయ్ పైకి బాయే..బాబు జైలుకు పాయే…అంటూ ప్రాసతో సెటైర్లు వేశారు. ఐదేళ్లలో జగన్ ఏం చేశాడు..మెరుపు తీగలా పరదాల మధ్య వచ్చి పోయాడు. దళిత మహిళపై అత్యాచారాల్లో ఏపీ మొదటి స్థానం…రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానం అని విమర్శించారు. తాను చాలాసార్లు బటన్ నొక్కాను, తన కోసం ఓటర్లు రెండు సార్లు బటన్ నొక్కమంటున్నాడని, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాత్రం ప్యాంట్ బటన్లు విప్పుతున్నాడని ఎద్దేవా చేశారు. అంబటి గంట..అవంతి అరగంట…అంటూ చురకలంటించారు.
ప్రతిపక్ష నేతగా జగన్ జనం నెత్తిన చేతులు పెట్టి…ముద్దులు పెట్టి..అధికారంలోకి రాగానే నెత్తిన టోపీ పెట్టిండు అని చురకలంటించారు. 99.5 శాతం హామీలు అమలు చేశానని జగన్ చెబుతున్నారని, కానీ, ఆయన ఇచ్చిన 716లలో 80 శాతం హామీలు పూర్తి చేయలేదని అన్నారు. సీపీఎస్ రద్దు కాలే…మద్యపాన నిషేధం కాలేదు…అని విరుచుకు పడ్డారు. ఇంత చక్కని పరిపాలనకు 40 మంది సలహాదారులంట…సజ్జలు, జొన్నలు..అంటూ సెటైర్లు వేశారు.