సిద్ధం సభలలో ప్రసంగిస్తున్న సీఎం జగన్ ప్రతి రోజు ఈ డైలాగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. నేను బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలలోకి దాదాపు మూడు లక్షల కోట్లు వేశాను అని జగన్ గొప్పలు చెబుతున్నారు. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని విధంగా ఇలా నగదు బదిలీ చేసి ప్రజల జీవితాలను మార్చేశానని అంటున్నారు. అయితే, సంపద సృష్టించకుండా పప్పు బెల్లాల్లాగా కొంతమంది ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నుల డబ్బును జగన్ పంచి పెడుతూ క్రెడిట్ తీసుకుంటున్నాడని విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈ బటన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. జగన్ బటన్ నొక్కుతున్నానంటూ గొప్పలకు పోతున్నాడని, మూలన ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని, అది పెద్ద విషయం కాదని జగన్ గాలి తీశారు చంద్రబాబు. బటన్ నొక్కడానికి కాదు ప్రజలు అధికారం ఇచ్చింది అంటూ జగన్ కు చురకలంటించారు. సంపద సృష్టించడానికి జగన్ కు ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ, బటన్ నొక్కడమే జగన్ కు చేతనవుతుందని, ఇంకేమీ చేతకాదని ఎద్దేవా చేశారు.
బటన్ నొక్కాను అంటున్నాడు. బటన్ నొక్కడం పెద్దపనా? మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది. సంపద సృష్టించాలి. ఆ సంపద
పేదలకు పంచాలి.#PrajaGalamForDemocracy #PrajaGalam #TDPJSPBJPWinning #AndhraPradesh pic.twitter.com/1BFK9GmM0A— Telugu Desam Party (@JaiTDP) April 16, 2024