ప్రస్తుత కీలక ఎన్నికల సమయంలో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపాలి? ఎటు వైపు మొగ్గు చూపుతున్నా రు? అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఉన్నత స్థాయి విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. అభివృద్ధి వైపు నిలబడాలా? లేక.. సంక్షేమం వైపు నిలబ డాలా? అనేది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చగా మారింది. దీనిపై ప్రజలు ఇంకా ఒక నిర్ణయానికి రాని మాట వాస్తవం. ఇక, నియోజకవర్గాల పరంగా చూసుకుంటే.. విజయవాడ లో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి.
వీటిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాస్ ఎక్కువగా ఉన్నారు. క్లాస్ కేవలం 15 శాతం ఓటర్లే ఉన్నారు. దీంతో ఇక్కడ ఇలాంటి చర్చలేదు. ఇక, విజయవాడ పశ్చిమలో వ్యాపారులు ఎక్కువగా ఉన్నా రు. బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు 20 శాతం వరకు ఉన్నాయి. దీంతో ఇక్కడ వారి హవానే కనిపిస్తుంది. కానీ, భిన్నమైన నియోజకవర్గం మాత్రం విజయవాడ తూర్పు. ఇక్కడ క్లాస్ , మాస్ కలగలుపు ఉంది. కానీ, వీరిలో క్లాస్ పీపుల్ ఓట్లు.. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాపులు కూడా గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో వీరు అన్ని కోణాల్లోనూ ఆలోచించే ఓట్లు వేస్తారు. ఇక్కడి వారికి సంక్షేమం కంటే కూడా రహదారుల విస్తరణ, పరిశ్రమల ఏర్పాటు, ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేని ప్రశాంత వాతావరణం. తమ ఎమ్మెల్యే వివాదాలకు దారి లేకుండా ఉండడం.. పిలిస్తే పలికే నాయకుడు కావాలని కోరుకుంటారు. అంతేకాదు.. సెటిల్మెంట్లు, పేకాట క్లబ్బుల నిర్వహణ వంటి వాటికి దూరంగా ఉండాలని కూడా ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే గత రెండు ఎన్నికల్లో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వరుసగా విజయం దక్కించుకునేలా చేసింది.
మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనేది కూడా ఆసక్తిగా మారింది. టీడీపీతరఫున మరోసారి సిట్టింగ్ నాయకు డు.. గద్దె రామ్మోహన్‌కే చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. ఇక, వైసీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలోనూ ఎవరు గెలిస్తే బాగుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. మెజారిటీ వర్గాల అభిప్రాయం మేరకు.. అభివృద్ధికే పట్టకట్టాలని చూస్తున్నారు. ఇక్కడ గత నెల రోజులుగా పలు సర్వేల్లో ప్రజలు ఇదే విషయాన్ని కోరుకుంటున్నట్టు తెలిసింది.
ఉద్యోగులు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు.. చెబుతున్నది ఏంటంటే.. విజయవాడ తూర్పు.. ప్రాంతం నగరానికి గుండెకాయ వంటిది. అనేక పరిశ్రమలు, కంపెనీలు, కీలకమైన ఆటోనగర్ వంటివి ఇక్కడే ఉన్నాయి. గత ఐదేళ్లలో ప్రభుత్వ ఉదాశీనత కారణంగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. అదేసమయంలో విస్తరిస్తున్న నగరంలో రియల్ ఎస్టేట్ పుంజుకోవాల్సిన అవసరం ఉందని.. తద్వారా.. తూర్పు నియోజకవర్గం మరింతగా డెవలప్ అవుతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు మరోసారి పగ్గాలు చేపట్టేందుకు అవకాశం ఉన్నదరిమిలా.. సౌమ్యు డు, వివాదరహితుడు, అబివృద్ధికి కేరాఫ్‌గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె వైపే మెజారిటీ జనాలు నిలబడు తున్నారన్నది సర్వేల్లో తేలుతోంది. అదే సమయంలో ఈసారికి సీనియర్ అయితే బాగుంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. పైగా.. గత పదేళ్లలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని, కేసులు, ఘర్షణలు లేవని.. ప్రశాంతంగా జీవిస్తున్నామని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీంతో గద్దె వైపే ఎక్కువగా ప్లస్‌లు కనిపిస్తున్నాయి.
ఇక వైసీపీ క్యాండెట్ అవినాష్ యువకుడేనని, ఇంకా సమయం ఉందని.. అనుభవం పెంచుకుంటే.. తదుపరి ఎన్నికల్లో ఆయన విజయం దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. `అవినాష్‌కు ఇంకా టైం ఉంది. ప్రజల్లోకి వెళ్లడంలో కాని… విజయవాడ నగర అభివృద్ధి విషయంలో కానీ ఆయనకంటూ ఓ విజన్ లేదని.. ఈ సారికి మేం గద్దె వైపే నిలబడాలని అనుకుంటున్నాం. ఈయన వస్తే.. కొంత అభివృద్ది జరుగుతుంది. కాబట్టి ఈ సారి గద్దెకే మా ఓటు` అని ఆటోనగర్ సహా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే టాక్ వినిపిస్తోంది.