తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత.. ఈ ఉగాదిని తీహార్ జైల్లోనే జరుపుకోనున్నారు. ఆమె పెట్టుకున్న బెయిల్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో రూ.100 కోట్ల బదిలీ వెనుక.. కవిత కీలక పాత్ర ధారి అంటూ ఈడీ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేసిన అధికారులు గత నెల మార్చి 15న ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు పరచగా.. కొన్ని రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిం చింది. తర్వాత.. 14 రోజుల రిమాండ్ విధించడంతో మార్చి 26 నుంచి కవిత.. తీహార్ జైల్లోనే ఉంటున్నా రు. అక్కడే తింటున్నారు. అయితే.. ప్రత్యేక సదుపాయాలను మాత్రం పొందుతున్నారు. పరుపు, దిండు, దుప్పటి, పెన్నులు.. బొట్టు బిళ్లలు ఇలా కొన్ని ప్రత్యక సదుపాయాలతోపాటు.. ఇంటి బోజనం కూడా ఆమెకు అందుతోంది. అయితే.. ఆమె బెయిల్ కొసం కోర్టులో పిటిషన్ వేశారు.
రెండు ప్రధాన కారణాలను కవిత ప్రస్తావించారు. 1) తనకుమారుడికి పరీక్షలు జరుగుతున్నాయని. తల్లిగా తనకు బాధ్యత ఉందని, పిల్లాడి భవిష్యత్తు తాను లేకపోతే నాశనం అయిపోతుందని, కాబట్టి తాను.. ఇంటికి వెళ్లాలని బెయిల్ కావాలని కోరారు. 2) ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ అధినేత కుమార్తెగా తనకు కొన్ని కీలక బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే బెయిల్ కావాలన్నారు. ఇక, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఇప్పటికే కొందరిని కవిత బెదిరించారని, ఫోన్లు ధ్వంసం చేశారని, సమాచారాన్ని తీసేశారని ఈడీ అధికారులు కోర్టుకు వెల్లడించారు.
ఇరు పక్షాల వాదనలు ముగిశాక… దీనిపై విచారణ కొన్ని రోజుల కిందటే పూర్తి అయినా.. తీర్పును మాత్రం రిజర్వ్ చేశారు. తాజాగా వెల్లడించిన తీర్పులో కోర్టు.. కవిత బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో కవిత కీలకమైన ఉగాది పండుగ ముందు.. ఆమె తీహార్ జైల్లోనే ఉండనున్నారు.