ఇటీవల కాలంలో ఇంతటి దారుణ వార్తను మీరు చదివి ఉండకపోవచ్చు. కొందరు మనుషులు ఎంతటి ప్రమాదకరంగా ఉంటారన్న విషయం తెలిపే వార్త ఇది. అత్యంత దుర్మార్గంగా భార్యను కిరాతకంగా హత్య చేసిన ఈ ఉదంతం వివరాల్ని చదువుతున్నప్పుడు ఇలా కూడా చేస్తారా? అంటూ వేదన కలుగుతుంది. భార్యను 224 ముక్కలుగా నరికేశాడు
బ్రిటన్ కు చెందిన 28 ఏళ్ల నికొలస్ మెట్సన్.
మెట్సన్, 26 ఏల్ల హోలీ బ్రామ్లీలు లింకన్ సిటీలోని బస్సింగ్ హోంలో నివాసం ఉంటున్నారు. తన భార్య బ్రామ్లీ మార్చి 17 నుంచి కనిపించకుండా పోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఆమె తనను చితకబాది ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా పోలీసులకు తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి ప్లాట్ ను తనిఖీ చేశారు.
ఈ క్రమంలో రక్తపు మరకలు.. అతిగా శుభ్రం చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించటం షురూ చేశారు. అయితే.. తనకేం తెలీదని.. తాను సుద్దపూసగా నికొలస్ చెప్పుకున్నారు. దీంతో.. పోలీసులు తమదైన శైలిలో విచారణ షురూ చేశారు. ఇదిలా ఉండగా.. ఇతడి ఇంటికి సమీపంలోని విథమ్ నదిలో నరికిన చేయితో పాటు.. చిన్న చిన్న శరీర భాగాలు బ్యాగులు కొట్టుకురావటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో గత ఈతగాళ్లను రంగంలోకి దింపి.. వాటిని సేకరించి ల్యాబ్ లకు పంపారు. ఈ క్రమంలో తాను చేసిన తప్పుడు పని గురించి నోరు విప్పాడు. అస్సలు గుర్తించలేని విధంగా తన భార్య హోలీ శరీరాన్ని పలుమార్లు పొడిచి 224 ముక్కలుగా నరికి నదిలో పడేసిన వైనాన్ని ఒప్పుకున్నాడు. ఈ దారుణాన్ని చేయటంలో తనకు తన స్నేహితుడు జాషువా హ్యాన్ కాక్ సాయం చేసినట్లుగా పేర్కొన్నారు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు.. విచారణలో తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు.
తన భార్యను చంపటానికి ముందు పెంపుడు కుక్కను.. పెంపుడు ఎలుకల్ని చంపేసినట్లుగా పేర్కొన్నారు. తాను తన మాజీ భాగస్వాములను కూడా హింసించిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. ఇతడి మీద 2013, 2016, 2017 పోలీసు రికార్డులో ఇతడిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తించేవాడని పోలీసుల విచారణలో తేలింది.
అంతేకాదు.. భార్యను హత్య చేసి దాదాపు వారం పాటు ఇంట్లోనే చిన్న బ్యాగుల్లో బాడీ పార్టులను ఉంచి.. ఆ తర్వాత వాటిని పడేశాడు. అంతేకాదు.. భార్య అకౌంట్ నుంచి కొంత డబ్బును విత్ డ్రా చేశాడు. అంతేకాదు భార్యను హత్య చేస్తే భర్తకు కలిగే లాభాలు.. ఆ తర్వా తఎవరైనా వెంటాడుతారా? విచారణ జరుగుతుందా? లాంటి పలు అంశాల్ని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. ఈ దానవుడికి ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.