తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే పార్టీ వైఎస్సార్సీపీ…
ఇంతవరకు మీరు చాలా సార్లు చూసి నిజం అనుకున్న భ్రమపడ్డ ఒక సీను అబద్ధమని ఈరోజు తేలింది.
అదేంటో సరిగ్గా జగన్ సభలు జరిగేటపుడే అంబులెన్సులు రావడం, జగన్ వాటికి దారివ్వడం చూసుంటారు కదా . చాలా సార్లు జరిగింది.
మొదట్లో ఇది నిజంగానే జరిగింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో దానిని పబ్లిసిటీకి వాడేసేద్దాం అని ఐ ప్యాక్ జగన్ కి సలహా ఇచ్చింది.
ఇలాంటి అనైతిక ఐడియాలకు పెట్టింది పేరు అయిన వైసీపీ దానిని పక్కాగా అమలు చేసింది.
జగన్ సభలో జగన్ మాట్లాడుతున్నపుడే ఒక అంబులెన్స్ వస్తుంది, దానికి జగన్ దారి ఇస్తాడు. తర్వాత పేటీఎం దానికి ఎలివేషన్ ఇస్తోంది.
నిజానికి ఒకసారి ఊహించండి… ఒక పార్టీ అధినేత మీటింగ్ ఉందంటే… ఆ ఊర్లో ముందురోజు నుంచే తెలుస్తుంది. అలాంటి సమయంలో మినిమం సెన్స్ ఉన్న ఏ అంబులెన్స్ వాడైనా వేరే రూటు చూసుకుంటారు. ఒక వేళ మధ్యలో ఉండి ఉంటే… పేటీఎం కార్యకర్తలు దానికి ఛాన్స్ ఇచ్చే అవకాశమే ఉండదు. మనుషుల్నే చంపే ఆ కాలకేయులు అంబులెన్సుకు దారివ్వడం దాదాపు అసాధ్యం. అలాంటిది సభ దాకా అంబులెన్స్ ఎలా రాగలుగుతుందో తెలుసా… నిజానికి అది పేషెంట్లు ఉన్న అంబులెన్స్ కాదు, కేవలం హ్యూమానిటీ హైప్ కోసం ఐ ప్యాక్ ప్లాన్ చేసి పంపిన ఉత్తుత్తి అంబులెన్స్. దానికి దారివ్వడం అనేది ఒక పబ్లిసిటీ స్టంట్.
అలా అని నిజమైన అంబులెన్సుకు జగన్ దారి ఇవ్వడు అన్నది ఇక్కడ పాయింట్ కాదు… సాధారణ టౌన్లలో ఇది ఇలా జరగదు. ఇక్కడ కేవలం ఉత్తినే అంబులెన్స్ ను తెచ్చి జగన్ కు ఎలివేషన్ ఇస్తున్నారు అంతే.
కోడుమూరు లో అంబులెన్సు కు దారి ఇచ్చిన సీఎం @ysjagan కాన్వాయ్! ♥️#MemanthaSiddham#YSJaganAgain#YSJaganCares pic.twitter.com/7KhOQTlX3w
— YSR Congress Party (@YSRCParty) March 29, 2024