చింతమనేని ప్రభాకర్ అంటేనే దూకుడుగా ఉంటారని.. మాటలు తూలతారని… ఆయనో కాంట్రవర్సీ రాజకీయ నాయకుడు అనే అంటారు.. ఇదే పేరు ఆయనకు తెలుగు ప్రజల్లో ఉంది. ఆయన గురించి ఈ మాటలే తరచూ వింటాం తప్పా ఆయన అవినీతి చేశాడనో.. అక్రమాలు చేసి సంపాదించుకున్నాడనో అన్న పేరు ఎప్పుడూ బయటకు రాదు… చింతమనేని అలాంటి వాటికి ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటారు.
చింతమనేని చిన్న మాట అన్నా ప్రత్యర్థులు అదే హైలెట్ చేస్తుంటారు. వాటినే భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటారు. ఆయన చేసిన సేవలు.. కాపాడిన ప్రాణాల గురించి మాత్రం ప్రత్యర్థులు చెప్పరు. అందులో కనీసం 10 శాతం చెప్పినా చాలు… అవి చింతమనేని పబ్లిసిటీ చేసుకున్నా చాలు.. ఇవన్నీ దెందులూరు ప్రజల్లోకి వెళితే చాలు మరో 20 ఏళ్ల వరకు దెందులూరు నియోజకవర్గంలో ఆయనపై పోటీ చేసేందుకు ఎవ్వరూ సాహసం కూడా చేయరు. గత 15 ఏళ్లుగా ప్రభాకర్ నియోజకవర్గంలో చూసుకున్నా కొన్ని వేల మందికి ఎన్నో సాయాలు చేశారు.
ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి చింతమనేని ఇచ్చిన భరోసా.. వాళ్లు బతకాలన్న తాపత్రయంలో ఉన్నప్పుడు చింతమనేని చేసిన సాయానికి వారు ప్రభాకర్‌కే ఎంతో రుణపడి ఉంటారు. ఇందుకు తాజాగా మరో ఉదాహరణ చెప్పుకోవాలి. పెదపాడు మండలం ముప్పర్రు గ్రామంలో ఓ బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓ కుటుంబంలో ఆడబిడ్డకు పెళ్లి కుదిరింది. పెళ్లి శుభలేఖలు ఇచ్చే క్రమంలో ఆ పిల్ల తండ్రి, అన్నకు యాక్సిడెంట్ అయ్యి ఇద్దరికి కాలు, చేయి విరిగింది.
ఏలూరులో ఓ ప్రముఖ హాస్పటల్ డాక్టర్ వారిద్దరికి వైద్యం చేసి.. ఆపరేషన్లు చేసి బిల్లు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ విషయం తెలిసిన చింతమనేని ఆ తండ్రి, కొడుకులను పరామర్శించడంతో పాటు ఆరోగ్య శ్రీ ఉన్నా ఆ డాక్టర్ బిల్లు తీసుకున్నట్టు తెలియడంతో నేరుగానే ఫోన్ చేశారు. అసలే దిగువ మధ్య తరగతి కుటుంబం.. పైగా ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి కుదిరి ఉంది. చింతమనేని ఫోన్‌తో వెంటనే ఆ డాక్టర్ ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో పెట్టి ఆ కుటుంబం కట్టిన బిల్లులు వెనక్కు తిరిగి ఇచ్చేశారు.
ఏ లీడర్ అయినా ఇలా ఇచ్చిన డబ్బులు వెనక్కు ఇప్పిస్తాడా… వాళ్ల ఆరోగ్యం విషయంలో అంత కేర్ తీసుకుంటాడా ? ఇవన్నీ ఎక్కడా బయటకు రావు.. ఆయన చెప్పుకునేందుకు కూడా ఇష్టపడడు. చింతమనేని చేసిన ఇలాంటి ఎన్నో మంచి పనులు బయటకు రావు.. రానివ్వరు.. అదే ఎవరిమీద అయినా చిన్నగా కోప్పడితే చాలు వాటిని భూతద్దంలో పెట్టి చూపించేస్తారు.
నియోజకవర్గంలోనే స్థానిక సంస్థల్లో ఓ మాజీ ప్రజాప్రతినిధి తల్లికి తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తితే.. తాను తల్లికి వైద్యం చేయించుకోలేకపోతున్నా అని మొత్తకుంటుంటే.. చింతమనేని మొత్తం సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించారు. ఈ విషయం మూడో వాడికి కూడా తెలియదు. తర్వాత చింతమనేని సదరు ఊరు వెళ్లినప్పుడు చిన్న ఇష్యూలో రాద్దాంతం జరిగింది. ఆ మాజీ ప్రజాప్రతినిధి మీద కోప్పడ్డారు. అంతే దానిని చిలువలు పలువలు చేసేశారు. కానీ చింతమనేని అంతకుముందు అదే వ్యక్తికి చేసిన సాయం ఎవ్వరికి తెలియదు.. ఆయన చేసింది.. పెట్టింది చెప్పుకోడు.. ఇష్టం ఉండదు. ఫైనల్‌గా చింతమనేని చేసే మంచి పనులు మరుగున పడేలా చేస్తారు.. ఆయన ఏదైనా మాట తూలితే హైలెట్ అయ్యేలా చేస్తారు.. పని చేయడం చేతకాని ఆయన ప్రత్యర్థులు..!