సినిమాల్లో గ్రాఫిక్స్ షాట్స్ మొత్తం గ్రీన్ మ్యాట్ మీద తీస్తారని అందరికీ తెలుసు. ఎందుకంటే లేనివి ఉన్నట్టు చూపించాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇపుడు వైసీపీ సభలకు జనం రావడం లేదు. మరి ఏం చేయాలి. లేని జనం ఉన్నట్టు చూపించాలి. మరి దానికి ఏం చేయాలి? సినిమా వాళ్ల లాగే గ్రీన్ మ్యాట్ వేసి సభలు నిర్వహించాలి. తర్వాత జనాన్ని యాడ్ చేయాలి.
వైసీపీ తాజా రాజకీయసభలకు గ్రీన్ మ్యాట్స్ తో కప్పేస్తున్నారు. ఎక్కడ జనం లేరో అక్కడ జనం యాడ్ చేసి సభ కంటే లేటుగా విజువల్స్ ప్రచారం చేస్తారు. లైవ్ ఇస్తే కష్టం. అందుకే లైవ్ రికార్డింగ్ నే లైవ్ అని ప్రచారం చేస్తున్నారు. జనం ఎక్కువ వచ్చారని చూపించుకునేందుకు గ్రౌండ్ మొత్తం గ్రీన్ మ్యాట్ పెట్టి డ్రోన్ షాట్స్ తీసి జనం ఉన్నట్లుగా గ్రాఫిక్స్ చేయించుకుని సభ జరుగుతున్న సమయంలో టీవీల్లో అవే నిజమైన దృశ్యాలని చూపించుకుంటున్నారు.
తాజాగా ఈ గ్రీన్ మ్యాట్ గ్రౌండ్ వైసీపీ అద్దంకిలో ఏర్పాటు చేస్తున్న సభ కోసం సిద్ధం చేశారు. డ్రోన్ షాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక గ్రాఫిక్ దృశ్యాలు జగన్ ప్రసంగించేటప్పుడు టీవీల్లో చూడవచ్చు. జనం మనసులో లేనపుడు గ్రాఫిక్స్ ఓట్లు రాల్చవు కదా.