ప్రపంచ వ్యాప్తంగా నిరంతరాయంగా అందుతున్న ఇంటర్నెట్ .. ఏ క్షణమైనా ఆగిపోవచ్చు.. కొన్ని గంట లు లేదా.. కొన్ని రోజుల పాటు ఈ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉండనుంది. దీనికి కారణం.. ఎర్ర సముద్రం గర్భంలో ఉన్న కీలకమైన కమ్యూనికేషన్ కేబుల్ వ్యవస్థను హౌతీ తీవ్ర వాదులు ధ్వంసం చేయడమే. ఎర్ర సముద్రం గర్భంలోని ప్రపంచ దేశాలకు చెందిన సమాచార కేబుళ్లను హౌతీలు ధ్వంసం చేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ప్రపంచ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేయడంలో సమాచార వ్యవస్థ కీలకమనే విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఈ వ్యవస్థపై ఆధారపడ్డా యి. ఇలాంటి వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా హౌతీలు తమ పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా భారత్-బ్రిటన్ దేశాల మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగు దేశాలకు చెందిన సమాచార వ్యవస్థపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది.
హౌతీలు ధ్వంసం చేసిన వాటిలో భారత్-ఐరోపా మధ్య సేవలు అందించేవే ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. యెమన్ తీర జలాల అడుగు నుంచి ఏర్పాటు చేసిన 4 కమ్యూనికేషన్ అతిపెద్ద వ్యవస్థలను హౌతీలు ధ్వంసం చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు జెరూసలేం పోస్ట్, గ్లోబెక్స్ వంటివి వెల్లడించింది. హౌతీ దాడుల్లో ధ్వంసమైన కేబుళ్లను పరిశీలిస్తే.. ఏఏఈ-1, సీకామ్, యూరప్-ఇండియా గేట్‌వే, టాటా గ్లోబల్ నెట్వర్క్ ఉన్నాయని తెలిపింది.
హమాస్‌కు అనుకూలంగా ఉన్న హౌతీలు.. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే దేశాలపై విరుచుకుపడుతున్నా రు. ఈ క్రమంలో ఎర్ర సముద్రాన్ని అడ్డాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సేనలు దాడులకు సిద్ధమయ్యాయి. హౌతీల అంతు చూస్తాని అగ్రరాజ్యం కూడా ప్రకటించుకుంది. ఈ నేపథ్యం లో.. సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హూతీలు హెచ్చరించారు. ఈ మేరకు వారు చెప్పినట్టుగానే తాజాగా 4 కీలక కేబుళ్లను వారు ధ్వంసంచేసినట్టు తెలిసింది.
ఇదీ ప్రభావం..
+ భారత్-బ్రిటన్ దేశాల మధ్య ఏ క్షణమైనా సమాచార వ్యవస్థ కుప్పకూలవచ్చు.
+ ఫోన్‌కాల్స్, రోజువారీ జరిగే బిలియన్ డాలర్ల కొద్దీ అంతర్జాతీయ నగదు లావాదేవీలు ఆగిపోయే అవకాశం
+ ప్రపంచ కమ్యూనికేషన్లలో 90శాతానికి ఇవే ఆధారం. భారత్‌కు వివిధ ప్రాంతాలతో జరిగే కమ్యూనికేషన్ల లో 50శాతం, ఖతర్‌కు 60శాతం, ఒమన్‌కు 70శాతం, యూఏఈకి 80శాతం, కెన్యాకు 90శాతం ఈ మార్గం నుంచే వెళతాయి. ఇవన్నీ.. ఇప్పుడు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.