ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు భూధందాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విపక్ష నేతల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ విమర్శలను తాజాగా వైసీపీ మంత్రి స్వయంగా ధృవీకరించారు. ఎవడో సుబ్బారెడ్డి అంట..అంటూ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాదరావు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.
ఎవడో సుబ్బారెడ్డి అంట కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తాం అంటుంటూ తంతా పొమ్మన్నాను…అని తాను వార్నింగ్ ఇచ్చానని ధర్మాన చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. నువ్వు ఎవడివి? శ్రీకాకుళం నీ అబ్బ సొమ్ము కాదు..తంతా పో అని ఆ సుబ్బారెడ్డిని తరిమేశానని ధర్మాన అన్నారు. వచ్చినవాడు ఏ పార్టీ అయినా ఎక్కడి నుంచి వచ్చినా.. ఇక్కడ అజమాయిషీ చేస్తానంటే అది తనకు అవమానం అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇలా వదిలేస్తే శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర రౌడీలమయం అవుతుందని చెప్పారు.
అయితే, తన కుమారుడికి ధర్మాన వైసీపీ టికెట్ ఆశించగా దానికి సుబ్బారెడ్డి అడ్డుపడ్డారని, అందుకే సుబ్బారెడ్డిపై ధర్మాన ఆ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.