మంగళగిరి రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. నిన్న గాక మొన్న వైసీపీ నుంచి బయటకు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డి.. పట్టుమని మూడు శుక్రవారాలు కూడా గడవకుండానే.. మళ్లీ జగన్ చెంతకు చేరిపోయారు.
తాజాగా ఆయన తాడేపల్లికి కూడా వెళ్లిపోయి.. సీఎం జగన్తోచేతులు కలిపా రు. పుష్పగుచ్ఛాలు అందించారు. వాస్తవానికి ఆయన వైసీపీకి రాజీనామా చేయడం.. వెంటనే కాం గ్రెస్‌లో చేరతానని చెప్పడం.. షర్మిల వెంటే నడుస్తానని ప్రకటించడం తెలిసిందే.
అయితే.. అనూహ్యంగా ఆయన వైసీపీ బాట పట్టారు. ఇది ఎవరూ ఊహించని రాజకీయం. కనీసంఎవరికీ మచ్చుకు కూడా అనుమానం రాలేదు. మొత్తం చర్చలు తెరచాటున పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమంలో అసలు ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది.
దీనిలో ప్రధానంగా రెండు హామీలు ఆళ్లకు ఇచ్చారనే చర్చ తెరమీదకి వచ్చింది.
ఒకటి మంగళగిరి టికెట్ మళ్లీ ఆళ్లకు ఇవ్వడం. గతంలో ఇక్కడ బీసీని నిల బెట్టాలని భావించి.. టీడీపీ నుంచి తీసుకువచ్చిన గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చారు.
కానీ, ఇప్పుడు మారిన వ్యూహంతో ఆళ్లకు టికెట్ ఇచ్చేయాలని నిర్ణయించారు. మరో వైపు.. గత ఎన్నికలకు ముందు ఆళ్లకు మంత్రి పదవిని ఇస్తామని అప్పట్లోనే జగన్ హామీఇచ్చారు. కానీ, ఇది అమలు కాలేదు. దీంతో రెండో దఫా మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. ఆళ్ల అలిగి చాలా రోజుల వరకు కనిపించకుండా పోయారు.
తర్వాత.. ఆయన సోదరుడు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోద్య రామిరెడ్డి బుజ్జగించి లైన్లో పెట్టారు.
ఇక, ఇప్పుడు మరోసారి వైసీపీ వస్తే.. మంత్రి పదవి పక్కా అని జగన్ హామీ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. దీంతో నే ఆళ్ల యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది.