రాజకీయాల్లో సినిమా వాళ్ల ప్రభావం అంతకంతకూ తగ్గుతున్నప్పటికీ.. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ప్రచారానికి
కమెడియన్లు ఆలీ, పృథ్వీ.. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. రచయితలు కోన వెంకట్, చిన్ని కృష్ణ.. లాంటి వాళ్లు ఆ పార్టీ తీర్థం పుచ్చుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కూడా ప్రచారం చేసి పెట్టారు.
ఐతే ఈసారి ఎన్నికల ముంగిట వైసీపీలో స్టార్ కళ కనిపించడం లేదు. పృథ్వీ ఆ పార్టీ నుంచి ఎప్పుడో బయటికి వచ్చేశాడు. ప్రస్తుతం అతను జనసేనలో ఉండి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆలీ, పోసాని, కోన వెంకట్ వైసీపీలోనే కొనసాగుతున్నారు కానీ ఇంతకముందులా యాక్టివ్గా కనిపించడం లేదు.
ఆలీ, పోసానిలకు ప్రభుత్వ పదవులు వచ్చినా కూడా అంత యాక్టివ్గా కనిపించడం లేదు. ఆలీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. అది వస్తే తన కోసం తాను ప్రచార చేసుకునేలా ఉన్నాడు. అంతే తప్ప పార్టీ కోసం స్వచ్ఛందంగా రంగంలోకి దిగే పరిస్థితి కనిపించడం లేదు.
మోహన్ బాబు అయితే ఎన్నికలు అయిన కొన్ని నెలల నుంచే వైసీపీకి దూరం అయ్యారు. విష్ణు కూడా రాజకీయాల గురించి మాట్లాడట్లేదు. చిన్నికృష్ణ కూడా రాజకీయాలకు దూరం అయ్యాడు. మొత్తంగా చూస్తే వైసీపీ ప్రచారంలో ఈసారి సినీ గ్లామర్ ఉండేలా కనిపించడం లేదు. ఐతే వైసీపీ వాళ్ల దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తే.. తమ నాయకుడిది సినిమా వాళ్లను మించిన గ్లామర్ అంటూ దీన్ని తేలిగ్గా కొట్టిపారేస్తారనడంలో సందేహం లేదు.