మంగళగిరిలో చేనేత కార్మికులకు అన్ని విధాలా ఆదుకుంటామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి భరోసానిచ్చారు.
మంగళగిరి పేరు చెబితే చేనేత చీరలు గుర్తొస్తాయని, ఇది నా సొంత ఊరు అన్న భావన కలుగుతుందని ఆమె చెప్పారు.
చేనేత కార్మికుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన వీవర్ శాలను బ్రాహ్మణి, టాటా తనేరా సిఈవో అంబూజ నారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీవర్ శాలలో ఏర్పాటు చేసిన అధునాతన మగ్గాలను ,కుట్టు శిక్షణా కేంద్రాలను వారిద్దరూ పరిశీలించారు.
చేనేత కార్మికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
నేతన్నలకు గుర్తింపు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని బ్రాహ్మణి అన్నారు.
వారి ఆదాయం రెట్టింపు చేసేందుకు సహకరిస్తామని బ్రాహ్మణి తెలిపారు.
టీడీపీ ఎన్నారై విభాగం, చేనేత ప్రముఖులు, రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వీవర్ శాలలో అధునాత మగ్గాలతో సరికొత్త డిజైన్లతో చేసేత దుస్తులు రూపొందిస్తారు.
టెక్నాలజీపరంగా సహకరించేందుకు, చీరలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపుకు చెందిన తనేరా స్వచ్ఛందంగా చేయందించింది.
భారతీయత సాంస్కృతిక కళలలో ఒకటైన చేనేత కళ ప్రపంచానికే ఆదర్శం, మరియు మన దేశానికి గర్వకారణంఅని తనేరా సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాటా గ్రూప్ కు చేందిన రమణా రమణారెడ్డి ,శాలిని, పాల్, ఎన్ ఆర్ ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్, బుచ్చిరాం ప్రసాద్, నందం అబద్ధయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.