ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమా ర్కు టెన్షన్ పట్టుకుంది. ఒకవైపు పార్టీ అధిష్టానం నుంచి మరోవైపు.. విపక్షాల దూకుడుతోనూ ఆయన తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే.. వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికలకు సంబంధిం చి అభ్యర్థులను ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికి ఆరు జాబితాలు విడుదల చేసింది. దీనిలో ఎక్కడా అనిల్ కుమార్ పేరు కనిపించలేదు.
పైగా.. అనిల్ కుమార్‌కు.. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అండదండలు పుష్కలంగా ఉన్నా యనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో ఆయనకు ఆర్థికంగా సాయం చేశారనే విషయం నియోజకవర్గంలో అంద రికీ తెలిసిందే. ఇప్పుడు కొలుసు పార్టీ మారిపోయేందుకు రెడీగా ఉన్న దరిమిలా.. ఆయన శిష్యుడిగా పేరు న్న కైలే పరిస్థితిపై వైసీపీ అధిష్టానానికి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయనకు ఇప్పటికీ టికె ట్ ప్రకటించలేదనే వాదన వినిపిస్తోంది. ఇది ఎమ్మెల్యేకి ఇబ్బందిగా మారింది.
ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. మరోవైపు.. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తిరుగుతూ. తన గ్రాఫ్‌ను అంచనా వేసుకుంటున్నారు. తనవారికి ఎనలేని హామీలు గుప్పిస్తు్నారు ఈ ఐదేళ్లు ఎలాగోలా అయిపోయింది.. ఈ సారి మాత్రం ఖచ్చితంగా డిమాండ్లు నెరవేరుస్తామని చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఇప్పటి వరకు.. టీడీపీ మాత్రమే తనకు పోటీ అని కైలే అనుకున్నారు. ఈ పార్టీ తరఫున సీనియ ర్ నాయకుడు వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజా పోటీలో ఉన్నారు.
దీంతో కుమార్ రాజాను సునాయా సంగా నెగ్గుకు రావచ్చని భావించారు. ఆయనకు యాంటీగా ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఇంతలోనే.. కాంగ్రెస్ పార్టీ తరఫున డీవై దాస్.. పేరు వినిపిస్తోంది. ఇటీవలే ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయాలని బావిస్తున్నారు. కాంగ్రెస్ ఎలానూ పుంజుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో దాస్‌కు టికెట్ ఖాయం అవుతుంది. ఇదే జరిగితే.. కైలే మరింత ప్రమాదంలో పడినట్టుగా అవుతుందని ఆయన వర్గం చెబుతోంది. త్రిముఖ పోటీలో టీడీపీ-జనసేన బలం ఉన్న వర్ల వారసుడు విజయం దక్కించుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. దీంతో అనిల్ కుమార్ టెన్షన్ పీక్ రేంజ్లో కొనసాగుతుండడం గమనార్హం.