అమెరికాలో కోవిడ్-19 రిలీఫ్ ఫండ్స్ దుర్వినియోగం స్కాం వ్యవహారం సంచలనం రేపుతోంది.
ప్రత్యేకించి పే చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (PPP) మరియు ఎకనామిక్ ఇంజురీ డిజాస్టర్ లోన్స్ (EIDL) దుర్వినియోగంపై ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS) దృష్టి సారించింది.
30 వేల మంది ఏజెంట్లను ఆ వ్యవహారంపై నిజాలు నిగ్గుతేల్చేందుకు నియమించింది.
ఆర్థిక నిపుణుడు జాన్ విలియమ్స్ ఆ నిధుల దుర్వినియోగం వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు.
దీంతో, కోవిడ్ సమయంలో 11.5 మిలియన్ల చిన్న వ్యాపార యజమానులకు అందిన డిజాస్టర్ లోన్లపై విచారణ జరిగే అవకాశముంది.
గత రెండు సంవత్సరాలలో స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (SBA) ద్వారా రిలీఫ్ ఫండ్లలో $1.2 ట్రిలియన్లు పెట్టారు.
అయితే, ఆ మొత్తంలో దాదాపు 70% నిధులు ఉద్యోగులకు చేరుకోలేదన్న దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
66% నుండి 77% నిధులు వ్యాపార యజమానులు మరియు వాటాదారుల చేతుల్లోకి మళ్లించారని తేలింది.
దుర్వినియోగం అయిన నిధులను తిరిగి పొందడానికి IRS విస్తృత ప్రచారాన్ని ప్రారంభించింది.
మోసపూరిత కార్యకలాపాలను గుర్తించడం మరియు దుర్వినియోగమైన నిధులను తిరిగి పొందడంపై దృష్టి సారించింది.
ప్రభుత్వ సహాయక చర్యలపై ప్రజలకు నమ్మకాన్ని పునరుద్ధరించడమో లక్ష్యంగా 30 వేల మంది ఏజెంట్లను నియమించింది.