వైసీపీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి రెండు కీలక ప్రాంతాల్లో ఓట్లు ఉండడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. ఉద్దేశ పూర్వకంగా చేశారో.. లేక అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ.. వైసీపీ సలహాదారుగా కీలక పోస్టులో ఉన్న సజ్జల కుటుంబానికి రెండు స్థానాల్లో ఓటు ఉండడం మాత్రం పొలిటికల్ హీట్‌ను పెంచేస్తోంది. తాజాగా వెలుగు చూసిన సమాచారం ప్రకారం.. సజ్జల రామకృష్నారెడ్డి, ఆయన భార్య, కుమారుడు, కోడలికి.. పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున ఓట్లు ఉన్నాయి.
పొన్నూరు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబరు 31లో సజ్జల కుటుంబానికి వరుస ఓట్లు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన భార్య లక్ష్మి, కుమారుడు భార్గవ రెడ్డి, కోడలు నవ్యలకు.. 799, 800, 801, 802 నెంబర్లతో ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలోనూ వీరికి ఓట్లు ఉండడం గమనా ర్హం. ఇక్కడ కూడా ఒకే పోలింగ్ బూత్‌లో వరుసగా ఓట్లు ఉండడం విశేషం. ఇలా రెండు చోట్ల సజ్జల కుటుంబానికి ఓట్లు ఉండడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నిజానికి.. ఇదేమీ సజ్జల కుటుంబం ఉద్దేశ పూర్వకంగా చేసిందని చెప్పుకొనే అవకాశం లేదు.
ఎందుకంటే.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కాబట్టి.. రెండు చోట్ల వోటు వేయాలన్న దుర్భుద్ధితో ఇలా చేస్తారని ఎవరూ ఊహించరు. ఒకవేళ రెండో చోట కూడా ఓటువేయాలని అనుకున్నా.. మీడియా కళ్లు ఎప్పుడూ.. వీరిని ఫాలో అవుతూనే ఉంటాయి కాబట్టి.. ఇది సాధ్యం కాదు. కానీ, సజ్జల కుటుంబానికి ఇలా రెండు చోట్ల ఓట్లు ఉండడం వెనుక ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది. ఇది.. ఓటర్ల జాబితాల్లో వలంటీ ర్లు.. లేదా వైసీపీనాయకుల ప్రమేయం ఉందనేందుకు ఇది పక్కా ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
“ఇది సజ్జల కుటుంబం ఉద్దేశ పూర్వకంగా చేయకపోయినా.. ఓటర్ల జాబితా తయారీ విషయంలో వైసీపీ నేతల ప్రమేయాన్ని స్పష్టం చేస్తోంది. అత్యుత్సాహానికి పోయిన.. వలంటీర్లు.. ఏకంగా సజ్జల కుటుంబానికి రెండు చోట్ల ఓట్లు కల్పించి ఉంటారు. ఈ విషయం రాజకీయంగా వైసీపీకి ఇబ్బందిగా మారనుంది. ఇలాం టివి సరిచేసుకుని.. మచ్చలేకుండా వెళ్తున్నామన్న భావన ప్రజల్లోనూ కల్పించాల్సి ఉంటుంది“ అని పరిశీలకులు అంటున్నారు.
ఎవరైనా అప్లై చేస్తేనే ఓటు వస్తుంది. కానీ పార్టీ పేజీలో టెక్నికల్ గా రెండు ఓట్లు వస్తే నకిలీ ఓట్లను దుష్ప్రచారం చేస్తుందట టీడీపీ… ఇది వైసీపీ పార్టీ కవరింగ్?
పొన్నూరు, మంగళగిరి రెండూ పక్క పక్క నియోజకవర్గాలు, మేము ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లు రెండు నియోజకవర్గాల బోర్డర్ లో ఉన్న గ్రామాల పరిధిలోకి వస్తుంది. సాంకేతిక లోపం వల్ల ఓటర్ల జాబితాలో మా పేర్లు రెండు చోట్ల నమోదైన విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే ఒకచోట తొలగింపునకు సంబంధించి… https://t.co/iDyWNFiNJE pic.twitter.com/9DCgFbCJty
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) February 13, 2024