పొత్తుల విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని.. ఈ సమయంలో ఎవరూ బయటకు వెళ్లి.. మీడియాతో నో.. సోషల్ మీడియాలోనో తేడాగా మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్.. తన పార్టీ నాయకులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపాలనే వ్యూహంతో అన్ని చేతులు కలిసి పోరాడాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సమయంలో జనసేనకు వ్యతిరేకంగా కొందరు ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేస్తారని.. వాటిని పట్టించుకోవద్దని సూచించారు.
అదేసమయంలో సొంత పార్టీలోనూ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పొత్తులు, టికె ట్లు, పోటీ వంటి వాటిపై ఎవరికైనాఏమైనా సందేహాలు ఉంటే.. వెంటనే పార్టీలో మాట్లాడాలని.. లేదా ఆపార్టీ నాయకులకు సమాఆచంర ఇవ్వాలని సూచించారు. అంతకుమించి.. మీడియాతో మాట్లాడితే.. ప్రత్యర్థులు దానిని మరింత ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నాయకులు జగ్రత్తగా వ్యవహరించా లని సూచించారు.
“జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నాం. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయొద్దు. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారు అవుతారు“ అని పవన్ అన్నారు.
ఎవరికైనా పొత్తులు, టికెట్లు, అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తద్వారా కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరుతాయని తెలిపారు.