చంద్రబాబు దిల్లీ పర్యటనలో వైసీపీలో గుబులు పుడుతోంది. దీంతో బుధవారం చంద్రబాబు దిల్లీ ఇలా వెళ్లగానే వైసీపీ సోషల్ మీడియా నుంచి ఫేక్ న్యూస్ మొదలైపోయింది.
బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందని తెలియగానే, అమిత్ షా, నడ్డాలు చంద్రబాబును పిలిచారని తెలియగానే వైసీపీ బ్యాచ్ ఫేక్ న్యూస్ తో చెలరేగియిపోయింది.
ఈ క్రమంలో వాళ్లు స్ప్రెడ్ చేసి ఓ ఫొటోను చూసి వైసీపీ అభిమానులు కూడా నవ్వుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ ఫొటోలు చూసి ఎవరైనా నవ్వుతారా అంటున్నారు.
చంద్రబాబు అమిత్ షా కాళ్లకు నమస్కారం పెడుతున్నట్లుగా ఫొటో మార్ఫింగ్ చేసి ప్రచారం మొదలుపెట్టారు. అది కూడా ‘వే టు న్యూస్’ వార్త తరహాలో ఆ లోగోతో ఈ ఫొటోను ప్రచారంలోకి తెచ్చారు.
దీంతో తమ సంస్థ పేరు వాడుకుంటూ తప్పుడు న్యూస్ ప్రచారం చేస్తున్నారని వే టు న్యూస్ కూడా ట్వీట్ చేసింది.
ఇంతకీ… ఈ ఫొటోకు మూలం తెలిస్తే ఆశ్చర్యపోతారు. చంద్రబాబు నాయుడు 2018లో పార్లమెంటుకు వెళ్లినప్పుడు దాన్ని ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావిస్తూ పార్లమెంటు ముఖద్వారానికి వంగి నమస్కారం చేస్తున్న ఫొటో అది. దాన్ని మార్ఫ్ చేసి అమిత్ షా ఎదురుగా వంగినట్లుగా మార్చి దుష్ప్రచారం మొదలుపెట్టారు వైసీపీవాళ్లు.
గతంలో జగన్ మోదీతో సమావేశమైన సందర్భాలలో ఆయన వంగి వంగి నమస్కారాలు పెట్టడం.. ఒకసారైతే కాళ్లు పట్టుకున్నంత పనిచేయడం వంటివి గతంలో విమర్శలకు దారితీశాయి.
మోదీ ముందు జగన్ పిల్లిలా మారిపోతాడంటూ విమర్శలొచ్చాయి. మోదీ కాళ్లు పట్టుకోవడానికి జగన్ ప్రయత్నిస్తే మోదీయే వారించారని కూడా అంటారు.
ఇవన్నీ బయటకు రావడంతో చంద్రబాబుపైనా అలాంటి ముద్ర వేసే ప్రయత్నంలో భాగంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇలాంటి మార్ఫింగ్ ఫొటోను ప్రచారంలోకి తెచ్చారు.
అయితే.. ఆ ఫొటో చూడగానే ఎవరైనా దీన్ని నమ్ముతారా అంటూ ప్రశ్నిస్తున్నారు.