వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు తమకు టికెట్ వస్తుందో రాదో అనే బెంగతో ఉన్న విషయం తెలిసిందే. మరి కొందరు.. సీట్లు మార్చారని.. ఇంకొందరు సీట్లు లేకుండా చేశారని కూడా ఆవేదనలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో వారు అనూహ్యంగా జగన్ కు షాకిస్తూ.. కీలక అడుగులు వేశారు. ఇది ఇప్పుడు వైసీపీని కుదిపేస్తోంది. అసలు ఎవరు ఇలా చేశారంటూ.. సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఏం జరిగింది..
తమకు నిధులు ఇవ్వకుండా, తమ నిధులు కూడా వాడుకుంటూ.. తమను ఇబ్బందులు పెడుతున్నార ని.. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు.. మంగళవా రం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే.. వారిని కట్టడి చేసేందుకు, కనీసం అసెంబ్లీ పరిసరాల్లో కి కూడా రాకుండా చేసేందుకు.. ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సర్పంచులను, వారి నాయకులను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
అయినప్పటికీ.. సర్పంచులు అసెంబ్లీని చేరుకున్నారు. ఎంతో నిఘా ఏర్పాటు చేసినప్పటికీ.. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్లు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు లాఠీ చార్చి చేయాల్సి వచ్చింది. అయితే.. అసలు సర్పంచులు అసెంబ్లీ దాకా ఎలా వచ్చారనేది ప్రభుత్వం ఆరా తీసింది. దీంతో సంచలన విషయం వెలుగు చూసింది.
కొందరు సర్పంచ్లను వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలే.. పైన చెప్పుకొన్నవారు..తమ కార్లలో తీసుకొచ్చి అసెంబ్లీ బయట విడిచిపెట్టారట. సాధారణంగా.. ఎమ్మెల్యేల కార్లను తనిఖీ చేస్తారు. అయితే వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల కార్లు తనిఖీ చేయకపోవడంతో అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్లు వచ్చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయి.. వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.