తొందరలోనే జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఫిక్స్ చేసేందుకు కాంగ్రెస్ అస్త్రాలను రెడీ చేసినట్లే ఉంది. మీడియా సమావేశాల్లోను అంతకుముందు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చేస్తున్న సమీక్షల్లో ఈ విషయాలు స్పష్టంగా అర్ధమవుతోంది. తాజాగా రాజకీయంగా వివాదానికి కేంద్రబిందువైన అంశం కృష్ణా, గోదావరి జలాలే. పార్లమెంటు ఎన్నికల్లోపు తెలంగాణాకు అన్నీరకాలుగా అన్యాయం చేసింది కేసీయార్ తో పాటు ఆయన కుటుంబమే అని బాగా జనాల్లోకి బాగా ఎక్కించాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్. అందుకనే వివిధ శాఖలపై లోతుగా సమీక్షలు చేస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, మేడిగడ్డ బ్యారేజి నాణ్యత లోపాలు, నదీ జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరగటం, ధరణి పోర్టల్ ద్వారా వేలాది మంది భూ యజమనాలకు అన్యాయం జరగటం లాంటి అనేక అంశాలను ఎన్నికల్లో అస్త్రాలుగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ రెడీ చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటినుండే కాంగ్రెస్ పై అంశాలపై కేసీయార్ తో పాటు ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పదేపదే ఆరోపణలు చేస్తున్నది. ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తన్న సమీక్షల్లో ఆ విషయాలే బయటపడతున్నాయి.
తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు చేసినవి ఆరోపణలు మాత్రమే కాదని పూర్తి నిజాలే అని ఇపుడు రేవంత్ తో పాటు మంత్రులు పదేపదే చెబుతున్నారు. రేపు పార్లమెంటు ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర నుండి ఇవే విషయాలను ప్రతి బహిరంగసభలోను ప్రచారం చేయాలని కాంగ్రెస్ డిసైడ్ చేసింది. ఇందుకోసం అవసరమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పాటు మెటీరియల్ ను సేకరిస్తోంది.
ఇక బీఆర్ఎస్ కోణంలో చూస్తే తమపై రేవంత్ రెడ్డి అండ్ కో చేయబోయే ఆరోపణలకు కౌంటర్లను కేసీయార్ అంట్ టీమ్ రెడీ చేసుకుంటోంది. అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని కేసీయార్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. మొదటిసభను నల్గొండ నియోజకవర్గం బహిరంగసభతోనే మొదలుపెట్టాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు.
తన బహిరంగసభల్లో తన హయాంలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణా ప్రయోజనాల రక్షణకు చేసిన కృష్టిని, కేంద్రప్రభుత్వంతో చేసిన పోరాటాలను వివరించాలని అనుకున్నారట. నదీజలాల వివాదంపై శ్వేతపత్రాలను కూడా రిలీజ్ చేయటానికి రెడీ అవుతున్నారట. మొత్తానికి రెండుపార్టీలు పార్లమెంటు ఎన్నికల ఎజెండాను సెట్ చేసుకున్నాయని అర్ధమైపోతోంది.