తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాల్క సుమన్…రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని ఉందని, కానీ సంస్కారం అడ్డు వస్తుందని చెప్పు చూపించి మరీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆవేశంతో ఊగిపోయిన బాల్క సుమన్ రేవంత్ రెడ్డిపై పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.
కేసీఆర్ ను లంగా అంటున్న రేవంత్ రెడ్డి పెద్ద రండగాడు, హౌలే గాడు అంటూ బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన పదవి, స్థాయిని బట్టి మాట్లాడాలని హితవు పలికారు. రైతుబంధు డబ్బులు అడిగితే రైతులను చెప్పుతో కొడతామని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతుబంధు కోసం విడుదల చేసిన 7700 కోట్ల రూపాయలను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కు, కాంగ్రెస్ కాంట్రాక్టర్లకు దారి మళ్లించారని సంచలన ఆరోపణలు చేశారు.
ఓ దశలో ఆవేశం పట్టలేకపోయిన బాల్క సుమన్…రేవంత్ రెడ్డి నా కొడుకు అంటూ పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మరి, బాల్క సుమన్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.