ప్రమాదకరమైన రసాయనాలతో మామిడిపళ్లను మగ్గిస్తున్నారట. దయచేసి ఊరికెళ్లి తోటల్లో తెచ్చుకుని మామిడిపళ్లను తినండి.
మామిడి పళ్లు పచ్చివి అయినా తినొచ్చు. కాబట్టి పండు కోసమే చూడకండి.
వీలైతే సొంతూరి నుంచి తెప్పించుకోండి.
లేకపోతే ఆర్గానిక్ మామిడి పళ్లను కొని తినండి
ఆరోగ్యం జాగ్రత్త. అసలే మామిడిని చూస్తే ఆగలేం.
చైనా నుంచి అక్రమ మార్గాల్లో దిగుమతి అవుతున్న ఎథెఫాన్ అనే ఒక రకం రసాయన పౌడర్ మన మామిడి పండ్లను విషంగా మార్చేస్తోంది.
కృత్రిమ పద్ధతుల్లో మామిడి కాయలను పండించడానికి వ్యాపారులు దీన్ని వాడుతున్నారు.
కాయ పండుగా మారడానికి ఐదారు రోజులు పడుతుంది. కానీ ఈ పౌడరు వేస్తే 24 గంటల్లోనే మామిడి కాయ పండి, నిగనిగలాడే బంగారు రంగులోకి వస్తుండడంతో దీన్ని ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.
అంతకుముందు కార్బైడ్‌తో పండించేవారు.. కానీ, కార్బైడ్‌ను నిషేధించాలని హైకోర్టు ఆదేశించడంతో పండ్ల వ్యాపారులు ఎథెఫాన్
ఎధెపాన్ వాడి పండించిన మామిడి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని.. చర్మ, కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎథెపాన్ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.