విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అయితే, వారికంటే ముందు ఎన్టీఆర్ ఘాట్ వద్ద టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరో కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తారక్ కు ఘన స్వాగతం పలుకుతూ అభిమానులు ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి.
ఆ ఫ్లెక్సీలను తొలగించాలని బాలకృష్ణ ఆదేశించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడే తీయించేయ్… అంటూ ఆ ఫ్లెక్సీలను తొలగించాలని బాలకృష్ణ చెప్పిన వీడియో వైరల్ గా మారింది. అయితే, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వస్తున్న తారక్ అభిమానులకు స్వాగతం అంటూ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోనే బాలయ్య బాబుకు కోపం వచ్చిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్వాగతం అని రాయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.