ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలై బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న గుంటూరు కారం చిత్రానికి పండుగ రోజైన సోమవారం రాత్రి సక్సెస్ సంబరాలు జరిగాయి. ఇందులో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు.. హీరోయిన్లు శ్రీ లీల, మీనాక్షి చౌదరి.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంగీత దర్శకుడు తమన్ పాల్గొనక పోవడం చర్చనీయాంశంగా మారింది.
వాళ్ళిద్దరికీ వేరే పనులు ఉండకపోవడం వల్ల.. సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వేడుకలకు హాజరు కాకపోయి ఉండొచ్చు. కానీ సోషల్ మీడియా జనాల దృష్టి కోణం అలా లేదు.గుంటూరు కారం చిత్రానికి డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ సక్సెస్ వేడుకల్లో పాల్గొనలేదని భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువగా విమర్శలు ఎదుర్కొన్నది దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ లే. పాత కథనే తిప్పి తిప్పి తీశాడు అని త్రివిక్రమ్ మీద విమర్శలు వచ్చాయి.
మహేష్ బాబు ఎంత కష్టపడ్డా అందుకు తగ్గ ప్రతిఫలం రాకపోవడానికి కారణం త్రివిక్రమే అని అభిమానులు నిందించారు. మరోవి తమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల విషయంలో తీవ్రంగా నిరాశపరిచాడనే చర్చ జరిగింది. రొటీన్ స్కోర్ ఇవ్వడం.. సౌండ్ మిక్సింగ్ సరిగా చేయకపోవడంపై మహేష్ అభిమానులు మండిపడ్డారు. తమ పనితనంపై మహేష్ అభిమానులు మండిపడ్డ నేపథ్యంలో.. సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొనడం అంత బాగుండదని త్రివిక్రమ్ దూరమై ఉండొచ్చని సోషల్ మీడియా జనాలు అభిప్రాయపడుతున్నారు