మరో 3 నెలల్లో ఏపీలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేల సిట్టింగ్ స్థానాలను వైసీపీ అధినేత జగన్ మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 11 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతూ జగన్ విడుదల చేసిన తొలి జాబితా చాలామంది వైసీపీ నేతలలో అసంతృత్వ జ్వాలలను రగిలించింది. మొదటి జాబితా విడుదలైన తర్వాత కొందరు నేతలు వైసీపీపై బహిరంగంగా విమర్శలు చేస్తుండగా…మరికొందరు పరోక్షంగా విమర్శలు గుప్పించి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.
అయినా సరే వెనక్కు తగ్గని జగన్ తాజాగా 27 మందితో సెకండ్ సిట్టింగ్ ఫిట్టింగ్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 3 ఎంపీ స్థానాలు, 24 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. వీటిలో పేర్ని నాని తనయుడు కిట్టు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడితోపాటు మరికొందరు వారసులు రాజకీయ అరంగేట్రం చేశారు. మరి, తాజా జాబితా నేపథ్యంలో సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన ఎమ్మెల్యేలు, ఎంపీల స్పందన, ఆగ్రహ జ్వాలలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది తేలాల్సి ఉంది.
వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన వైసీపీ సిట్టింగ్ ఫిట్టింగ్ సెకండ్ లిస్ట్ ఇదే…
అనంతపురం పార్లమెంటు – శంకరనారాయణ
హిందూపురం పార్లమెంటు – శాంతమ్మ
అరకు పార్లమెంటు – భాగ్యలక్ష్మి
పెనుకొండ – ఉషశ్రీ చరణ్
ఎర్రగొండపాలెం – తాటిపర్తి రాజశేఖర్
ఎమ్మిగనూరు – మాచాని వెంకటేష్
గుంటూరు ఈస్ట్ – షేక్ నూర్ ఫాతిమా
మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి(కిట్టూ)
కల్యాణదుర్గం – తలారి రంగయ్య
అరకు అసెంబ్లీ – గొడ్డేటి మాధవి
విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు
పిఠాపురం – వంగా గీత
రాజాం – తాలే రాజేష్
ప్రత్తిపాడు – వరపుల సుబ్బారావు
తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాశ్
పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు
విజయవాడ వెస్ట్ – షేక్ అసీఫ్
చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
కదిరి – మక్బుల్ అహ్మద్
అనకాపల్లి – మలకాపల్లి భరత్ కుమార్
జగ్గంపేట – తోట నరసింహం
పాయకరావు పేట – కంబాల జోగులు
రాజమండ్రి రూరల్ – వేణుగోపాల కృష్ణ
పి. గన్నవరం – వేణుగోపాల్
పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి