అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా 2024-25 సంవత్సరాలకు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లను ప్రకటించింది.
నాట్స్ బోర్డు ఛైర్మన్‌గా ప్రశాంత్ పిన్నమనేనికి బాధ్యతలు అప్పగించింది..
నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా నంద కిషోర్ కంచర్ల, నాట్స్ బోర్డు సెక్రటరీగా మధు బోడపాటికి కీలక పదవులు వరించాయి.
ప్రస్తుతం నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా ఉన్న ప్రశాంత్ పిన్నమనేని నిబద్ధత, సేవా దృక్పథం, నిరంతరం ఆయన చేస్తున్న కార్యక్రమాల వల్ల నాట్స్ నాయకత్వం బోర్డు ఛైర్మన్‌గా ప్రశాంత్ పిన్నమనేని వైపే చూసేలా చేశాయి.
ప్లోరిడాలో నాట్స్ చేస్తున్న కార్యక్రమాల్లో ప్రశాంత్ పిన్నమనేని కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
నాట్స్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ప్రశాంత్ పిన్నమనేని ఎట్టకేలకు నాట్స్ అత్యున్నతమైన బోర్డు ఛైర్మన్ పదవికి చేరుకున్నారు.
ప్రస్తుత నాట్స్ బోర్డ్ ఛైర్మన్ పదవి కాలం 2023 డిసెంబర్‌తో ముగియడంతో నాట్స్ బోర్డు తాజాగా కొత్త బోర్డును ప్రకటించింది.
ప్రస్తుతం నాట్స్ బోర్డు ఛైర్ పర్సన్ ఉన్న అరుణ గంటి నుంచి ప్రశాంత్ పిన్నమనేని బోర్డ్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.
ఆది గెల్లి, అనుదీప్ అర్ల, బిందు యలమంచిలి, కృష్ణ మల్లిన, ప్రేమ్ కలిదిండి, రఘు రొయ్యూరు, రాహుల్ కోనె, రాజ్ అల్లాడ, రాజేంద్ర మాదల, రవి గుమ్మడిపూడి, శ్యాం నాళం, శ్రీహరి మందాడి, శ్రీనివాస్ పిడికిటి, సుమిత్ అరిగపూడి, సురేశ్ బాబు పెద్ది, టీపీ రావు, వెంకట్ శాఖమూరిలను నాట్స్ బోర్డు డైరెక్టర్ పదవులు వరించాయి.
వీరితో పాటు ప్రస్తుత నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి, నాట్స్ బోర్డు మాజీ ఛైర్ పర్సన్స్ అరుణ గంటి, శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ మాజీ అధ్యక్షులు శేఖర్ అన్నే, శ్రీనివాస్ మంచికలపూడి, మోహన కృష్ణ మన్నవలు నాట్స్ బోర్డులో కొనసాగనున్నారు.
నాట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులుగా మధు కొర్రపాటి, శ్యాం మద్దాళి, శ్రీధర్ అప్పసాని, సుధీర్ సి అట్లూరి (మెడికల్), చందు నంగినేని, రాజేశ్ నెట్టెంలు వ్యవహరించనున్నారు.
నాట్స్ కొత్త బోర్డు సభ్యులకు నాట్స్ బోర్డు తాజా మాజీ చైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నాట్స్ లక్ష్యాలను, ఆశయాలను బోర్డు సభ్యులు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారనే విశ్వాసం తనకు పూర్తిగా ఉందన్నారు.
ఇంతకాలం నాట్స్ బోర్డు చైర్ పర్సన్ బాధ్యతలను నిర్వర్తించడంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి అరుణ గంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.