తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దూకుడు కంటిన్యూ అవుతుందా ? వెలువడుతున్న సర్వే ఫలితాలు, జరుగుతున్న మౌత్ టాక్ ను చూస్తే అవుననే అనిపిస్తోంది. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ గెలుపులో ఎక్కువ భాగం పాజిటివ్ మౌత్ టాక్ కీలకమనే చెప్పాలి. కేసీయార్ పదేళ్ల పాలనలో పెరిగిపోయిన వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ అనుకూల ప్రచారం కలిసి హస్తం పార్టీ గెలుపు సాధ్యమైంది.
సేమ్ టు సేమ్ అదే పద్ధతి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. తాజాగా వెల్లడై ఏబీపీ సీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్ కు మ్యాగ్జిమమ్ అంటే 11 సీట్లొచ్చే అవకాశాలున్నట్లు తేలింది. బీఆర్ఎస్ కు 3-5 సీట్ల మధ్య, బీజేపీకి 1-3 సీట్ల మధ్య వస్తాయని జోస్యం చెప్పింది. ఉన్న 17 సీట్లలో కాంగ్రెస్ కు 11 సీట్లు దక్కే అవకాశం ఉందంటే అది చాలామంది ఫలితమనే చెప్పాలి. మొన్నటి అసెంబ్లీ సీట్లలో గెలిచిన విజయంతో పోలిస్తే రాబోయే పార్లమెంటు సీట్లలో గెలవబోయే సీట్లే దామాషానే ఎక్కువని సర్వేల్లో ఎలా తేలింది ? జరుగుతున్న మౌత్ పబ్లిసిటీనే కారణం అని అర్ధమవుతోంది.
ఎలాగంటే రేవంత్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి తీసుకుంటున్న చర్యలే జనాల్లో మంచి మార్కులు వేస్తున్నాయట. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన సిక్స్ గ్యారెంటీస్ లో రెండు గ్యారెంటీలు ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచటం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తేవటం ముఖ్యమైనది. అలాగే రు. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా తొందరలోనే అమలు చేయబోతోంది.
అలాగే సీఎంగా బాధ్యత తీసుకోగానే ప్రజాదర్బార్ (ప్రజావాణి) మొదలుపెట్టడం, సమస్యల పరిష్కారానికి చొరవచూపించటం, ప్రగతిభవన్‌ను జనాలకు ఓపెన్ చేయటం, సచివాలయంలోకి మామూలు జనాలను ఎలౌ చేయటం లాంటి ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలను తరచూ కలుస్తుండటం లాంటి చర్యలతో జనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సానుకూలత పెరుగుతోంది. పదేళ్ళ కేసీయార్ పాలనను 15 రోజుల రేవంత్ పాలనను జనాలు పోల్చి చూసుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సానుకూలత పెరుగుతోంది. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లొస్తాయేమో.